బీజేపీ – జనసేన కూటమిని దెబ్బకొట్టడానికి మొదటి నుంచి రెండు ప్రాంతీయ పార్టీలు చేయని ప్రయత్నాలు లేవు. పవన్ కల్యాణ్ వారి ట్రాప్లో పడ్డారా లేకపోతే పవన్ పరిణితి లేని నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నది పక్కన పెడితే రెండు పార్టీలు కలిసి ఆయనకు మద్దతుగా ఉంటుందనుకున్న వర్గంలో చిచ్చు పెట్టేశారు. పవన్ నే పావుగా వాడుకుని కాపుల్ని రెండువర్గాలుగా చీల్చేశారు. ముద్రగడ ఉదంతంతో ఇది నిజమని తేలిపోయింది. తాజాగా ముద్రగడ రాసిన లేఖతో… తేల్చుకుందామన్న సంకేతాలు ఇవ్వడంతో అసలు విషయం అందరికీ అర్థమవుతోంది.
పవన్ బలాన్ని చీల్చడమే అసలు లక్ష్యం
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ విమర్శలు చేస్తే… ముద్రగడ పద్మనాభం.. పవన్ పై విమర్శలు చేస్తూ లేఖలు రాశారు. దానికి పవన్ అభిమానులు స్పందిస్తే.. ముద్రగడ పవన్ నే టార్గెట్ చేస్తూ మరో లేఖ రాశారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని.. ఆయన అంటున్నారు. కాకినాడ నుంచి ద్వారంపూడి మీదనో లేకపోతే పిఠాపురం నుంచి తన మీదనో పోటీ చేయాలని ఆయనంటున్నారు. అంటే ముద్రగడ .. తనను తాను కాపు నాయకుడిగా తీర్మానించేసుకుని అదే హోదాలో పిఠాపురం నుంచి పోటీ చేస్తాను.. తనపై పోటీకి రమ్మని సవాల్ చేశారన్నమాట. అంటే కాపుల్ని రెండు వర్గాలుగా చీల్చే లక్ష్యం ఇక్కడ కనిపిస్తోంది.
జనసేనాని ఇప్పటికైనా రాజకీయం గుర్తిస్తారా ?
కాపు వర్గం బలాన్ని తగ్గించేందుకు ప్రాంతీయ పార్టీలు చేస్తున్న రాజకీయంలో పవన్ పావుగా మారారు. పదే పదే కుల ప్రస్తావన తెస్తూ ఆయన చేస్తున్న ప్రసంగాల్లోనూ కుల ప్రస్తావన తె్తున్నారు. పవన్ రాజకీయంగా బలపడితే.. అందులో కాపు వర్గానిదే ఎక్కువ పాత్ర. పవన్ అందరి వాడు. ఆయన సినిమాలను అందరూ చూస్తారు. అయితే సినిమా వేరు రాజకీయం వేరు. జనసేనకు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఆ ఓటు బ్యాంక్ కాపులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓటు బ్యాంకు ను చెల్లాచెదురు చేసి.. కాపులకు ఓ పార్టీ లేదన్న భావన కల్పించే వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కాపు రిజర్వేషన్లు కల్పించిన బీజేపీని గుర్తు చేయకపోవడం లక్ష్యం
ప్రధాని మోదీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం కల్పించారు . అందులో ఐదు శాతం ఏపీలో కాపులకు కేటాయించారు. కానీ జగన్ ప్రభుత్వం వాటిని నిలిపి వేసింది. ఇటీవల బీజేపీ కాపులకు చేసిన మేళ్ల గురించి విస్తృత ప్రచారం జరిగింది. అయితే జనసేనాధినేత కలిసి ఈ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకోవడంలో ఆసక్తి చూపించలేదు. దీంతో బీజేపీ వెనుకబడిపోయింది. ఐక్యత లేకపోవడంతో ఇప్పుడు కాపులలో చీలికకు అసలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ రకంగా ప్రస్తుతం కాపు ట్రాప్లో జనసేనాని పడ్డారు.