ముస్లింలతో సమావేశాల్లో బీజేపీ ప్రస్తావన ! పవన్‌ బీజేపీపై పవన్ కుట్ర చేస్తున్నారా ?

ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. క్రిస్టియన్ ప్రజలు మెజార్టీ గా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టింది. ఇలా కళ్లముందు కనిపిస్తున్న నిజాలు ఉండగా.. బీజేపీని ఇంకా ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్ర వేసేందుకు విపక్షాలే కాదు.. పవన్ కల్యాణ్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు బీజేపీతో సమావేశం అయినా ఆయన బీజేపీ ప్రస్తావన తీసుకు రాకుండా ఉండరు. బీజేపీ ముస్లింలను ఏదో చేస్తుందని తాను అడ్డుకుంటానని.. ఊరుకోనని ఆయన చెబుతున్నారు. బీజేపీ ఎప్పుడు ముస్లింలకు చెడు చేసిదో మాత్రం ఆయన చెప్పరు.

పవన్‌ది అవగాహనా రాహిత్యమా ? బీజేపీపై కుట్ర చేశారా ?

బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ముస్లింలకు నచ్చదని పవన్ కల్యాణ్ ప్రకటించడంపై ఏపీ బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారు. వారాహియాత్రలో భాగంగా ముస్లింలతో ఆయన సమావేశం అయ్యారు. భారతదేశ నాయకుల కంటే సమాజం చాలా గొప్పదని అన్నారు. అందుకే దేశంలో 17 శాతం మైనార్టీలు స్వేచ్ఛగా బతకుతున్నారని పవన్ చెప్పారు. ఈ సమాజంలో కూడా బీజేపీ భాగమని అయన గుర్తించలేకపోయారు. బీజేపీతో పొత్తులో ఉన్నానని, ముస్లింలు తనతో ఉండకపోతే మీరే నష్టపోతారని చాలా ముస్లిం పెద్దలను కలిసిన సందర్భంలో చెప్పానని అన్నారు. మీరు మైనారిటీలు కాదని మెజారిటీగానే భావించాలని అన్నారు. ఎలాంటి అభద్రతా భావంతో ఉండొద్దని, గతసారి తాను గుడ్డిగా బీజేపీగా వత్తాసు పలకబోనని చెప్పుకొచ్చారు. బీజేపీని ఇలా ముస్లింలలో విలన్ ను చేయాలని పవన్ ప్రయత్నించడం వివాదాస్పమవుతోంది.

బీజేపీ హిందూత్వ రాజకీయాలపై పవన్ కు అర్థమైంది అదేనా ?

హిందూత్వం అంటే మతం కాదు జీవన విధానం. దేశంలో అరాచకాలను బీజేపీ ప్రశ్నించింది .. అందరికీ సమాన హక్కులను బీజేపీ కోరుతోంది .. అంతే కానీ.. మత పరమైన సంతుష్టీకరణ చేయాలని ఎప్పుడూ అనుకోవడం లేదు. ముస్లింలను బీజేపీ ఎప్పుడూ వేధించలేదు. దేశంలో ముస్లిం జనాభా ఎంత మంది ఉన్నారో పవన్ కు.. వారంతా దేశంలో విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అందరితో పాటు సమానంగా స్వేచ్చను అనుభవిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లయినా ముస్లిం సమాజం హాయిగానే ఉంది. అంటే ఎలాంటి ఇబ్బంది పడలేదనే కదా అర్థం . మరి బీజేపీ ని ముస్లిం వ్యతిరేకిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు ?

మత పరమైన వివక్షనే బీజేపీ వ్యతిరేకిస్తుంది !

ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం.. విచ్చలవిడిగా వారికి అనేక వెసులుబాట్లు కల్పించాయి.ఈ కారణంగా కొంత మంది తాము చట్టాల కంటే ఉన్నతులమని భావిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల.. సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవు. కానీ ముస్లింలను ఓటు బ్యాంక్ గా చేసుకోవడానికి కులాల ప్రతిపాదికిన వారికి రిజర్వేషన్లు కల్పించారు. ఇలాంటి వాటిని వ్యతిరేకించకపోతే నష్టపోయేది ఎవరు.. బడుగు, బలహీనవర్గాల ప్రజలే.

మొత్తంగా పవన్ కు రాజకీయ అవగాహన రాహిత్యం భారీగా ఉందని.. బీజేపీతో హిందూత్వ వాదంపై అసలు ఆయనకు స్పష్టతే లేదన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.