జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను సీఎంను చేయాలని అర్థిస్తున్న ప్రకటనలు… చంద్రబాబు 175 నియోజకవర్గాల్లోనూ గెలిపించాలని చేస్తున్న ప్రకటనలు కలిపి ఒకటే సందేశం ఏపీ రాజకీయాలకు ఇస్తున్నాయి. అదేమిటంటే.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశాల్లేవని క్లారిటీ వస్తోంది. పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ.. తనకు సీఎం అయ్యేంత సామర్థ్యం లేదని.. ఓ పాతిక సీట్లు అయినా గెలిపిస్తే చాలన్నట్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అర్థింపులు ప్రారంభించారు. సీఎం సీటు ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నారు.
సీఎం సీటు కోసం పవన్ అర్థింపులు
పవన్ కల్యాణ్ మనసు సీఎం సీటుపై పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే టీడీపీకి దూరం అవుతున్నారని.. అంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీఎం సీటు అనే చర్చే రానివ్వదు. అందులో డౌట్ లేదు. ఉన్న ఆరు శాతం ఓటింగ్ కోసం పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు అదీ కూడా.. అన్నీ లెక్కలేసి తాము ఇచ్చే సీట్లు తీసుకోవాలని టీడీపీ ప్రపోజల్ పెట్టిందంటున్నారు. దీనికి పవన్ కల్యాణ్ అంగీకరించలేదని తెలుస్తోంది. అందుకే.. ఇంత కాలం పొత్తుల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు మాత్రం… ఆ ప్రస్తావన చేయకుండానే వారాహి యాత్ర చేస్తున్నారు.
పవన్ ను సీరియస్ గా తీసుకోని టీడీపీ
ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ అయినా ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అన్నది చెప్పడం కష్టం. రెండో సారి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్ శూన్యం అవుతుంది. అందుకే తన గెలుపు గురించి మథన పడుతున్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా రెండు వందలకోట్లు ఖర్చు పెట్టి డించేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. పవన్ కు ఈ భయాలున్నా.. ఎందుకు అర్థింపులు చేస్తున్నారో జనసైనికులకూ అర్థం కాని విషయం. ఓట్లు చీలకూడదుకుంటే.. చేయాలనుకున్నది చేయాలి. ఓట్లు చీలికతో సంబంధం లేదు.. సొంత బలం ప్రకారమే ముందుకు వెళ్లాలి. కానీ పవన్ ఏదీ తేల్చుకోలేకపోతున్నారు.
బీజేపీతో పొత్తులో ఉండి కనీస ధర్మం పాటించని పవన్
నిజానికి పొత్తుల విషయంలో పవన్ ఏ మాత్రం ధర్మం పాటించడం లేదు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు అకారణంగా ఆ పార్టీని వదిలేశారు. బీజేపీతోనూ అంతే. మళ్లీ ఏ కారణం లేకుడానే బీజేపీతో కలిశారు.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తులో ఉన్నానంటారు కానీ.. కనీస మిత్రధర్మం కూడా పాటించరు. ఢిల్లీ నేతలతో మాట్లాడతాను కానీ.. రాష్ట్ర నేతలతో సంబంధాలు లేవంటారు. ఇక్కడ రాజకీయాలు చేస్తోంది రాష్ట్ర నేతలు.. పొత్తులు పెట్టుకుంది.. కలిసి నడవాల్సింది కూడా రాష్ట్ర నేతలతో అయినా పవన్ మొత్తం వదిలేశారు. పొత్తు ధర్మం అంటే తెలియని టీడీపీతోనూ కలిసి ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. కనీస రాజకీయ నిలకడ లేని నేతలు.. అంతకు మించిన తలబిరుసు ఉన్న చోటా నేతలు జనసేనలోనే ఉన్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.