కాంగ్రెస్ గెలవదని చెప్పేసిన రేవంత్ రెడ్డి – తెలంగాణలో హస్తం పనైపోయినట్లేనా ?

ఇదిగో మా పార్టీ సర్వే అని ఎవరైనా ప్రకటించారంటే అందులో ఖ్చచితంగా ఆ పార్టీ గెలవాలి. ఓడిపోతుందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటే ఇక భవిష్యత్ ఎలా ఉంటుంది…? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ఓ సర్వే రిలీజ్ చేసి.. తమ పార్టీ ఓడిపోతుందని ప్రకటించారు. దీంతో.. కాంగ్రెస్ నేతలంతా తలలు పట్టుకోవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డినే అలా ప్రకటిస్తే ఇక తాము ఏం చేయగలమని. ఆయనేదో పోటుగాడనుకుంటే ఇలా చేశారేమిటన్న వ్యథ ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌కు 45 సీట్లు మాత్రమే వస్తాయంటున్నరేవంత్

రేవంత్ రెడ్డి తాము పార్టీ తరపున చేసిన ఓ సర్వేను రిలీజ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కు డెభ్బై సీట్లు ఖాయమని చెబుతూ ఉండేవారు. కానీ సర్వేలో 45 సీట్లు మాత్రమే వేసుకున్నారు . బీఆర్ఎస్ కు కూడా నలభై ఐదు సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఓట్లు కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం ఓట్లు తక్కువ వస్తాయని ప్రకటించారు. కాంగ్రెస్ అంతర్గత సర్వే లో ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పడంతో జర్నలిస్టులు కూడా విస్మయానికి గురయ్యారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలతో.. రేవంత్ ఇలా మాట్లాడుతున్నారు కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో భట్టి విక్రమార్క్ కూడా పాదయాత్ర చేశారు. దీంతో ఆయన కూడా రేసులోకి వచ్చారు.

బీజేపీని తక్కువ చేయడానికి తాము ఓడిపోతామని రేవంత్ చెప్పారా ?

మరో వైపు తాము గెలవకపోయినా పర్వాలేదు.. బీఆర్ఎస్ గెలవాలి…. బీజేపీ గెలవకూడదన్న వ్యూహాన్ని రేవంత్ పాటిస్తున్నట్లుగా ఉందన్న ్నుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఈ సర్వేలో బీజేపీకి ఏడుఅసెంబ్లీ సీట్లు.. 14 శాతం ఓట్లు మాత్రమే వస్తాయన్నారు. దీని ప్రకారం చూస్తే.. ముఖాముఖి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతోందని చెప్పడానికే ఆ రెండు పార్టీలు కలిసి ఈ సర్వే డ్రామాను ఆడుతున్నాయన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ లో ఇటీవల చేరికల ప్రకటనలు వస్తున్నాయి కానీ ఎవరూ చేరడం లేదు. పొంగులేటి చేరిపోతున్నాడని చెబుతున్నారు కానీ ఆయన మాత్రం అధికారికంగా చెప్పడం లేదు.

బీజేపీపై కాంగ్రెస్ , బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయా ?

కేసీఆర్ ఇటీవల వ్యూహాత్మకంగా బీజేపీపై విమర్శలు తగ్గించారు. బీజేపీతో తాము స్నేహంగానే ఉంటామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. అసలు ఈ వ్యూహం వెనుకే పెద్ద కుట్ర ఉందంటున్నారు. కాంగ్రెస్ ను లేపడానికే ఇలా చేస్తున్నారని.. బీజేపీని దెబ్బకొట్టే లక్ష్యం ఉందని చెబుతున్నారు. తమ రెండు పార్టీల మధ్యే పోటీ ఉందని చూపించి ప్రజల్ని.. మభ్యపెట్టి బీజేపీ ని దెబ్బకొట్టాలని ఆ రెండు పార్టీలు వ్యూహత్మకంగా కదులుతున్నాయని.. అందులో భాగంగానే సొంత పార్టీ గెలవదని.. స్వయంగా రేవంత్ సర్వేలు రిలీజ్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.