‘ఐ లవ్ యూ నాన్న’..ఫాదర్స్ డే ఆగస్టు మూడో ఆదివారమే ఎందుకు జరుపుకుంటారు!

ఫాదర్స్ డే అనగానే ఓ ప్రశ్న ఎదురొస్తుంది. నాన్నకో రోజుందా …అయినా మన జీవితంలో నాన్నలేని రోజుందా అసలు! నిజానికి నాన్నతో రోజూ పండగే ! నాన్నంటేనే పండగ అన్నట్టు మారిపోయింది. అప్పటి వరకూ ఉన్న కుర్రతనాన్ని పెద్దరికంగా మార్చుకుంటాడు. తొమ్మిదినెలలు అమ్మకడుపులో ఉండి భూమ్మీదపడగానే ఉత్సాహంగా చేతుల్లోకి తీసుకుంటాడు. అడుగు ఎలా వేయాలో నేర్పుతాడు. ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తాడు. గుచ్చుకుంటుందంటే మీసం తీసేస్తాడు. అలిగి బుంగమూతి పెడితే కోపం తగ్గించేసుకుంటాడు. నాన్నంటే బెత్తం. నాన్నంటే పెత్తనం లాంటి మాటలు మారిపోయాయి. ఇప్పుడంతా మోడ్రన్ ఫాదర్స్. ఇంకా చెప్పాలంటే అమ్మకన్నా సున్నితంగా తయారయ్యాడు నాన్న. అలాంటి నాన్నలపై ప్రేమము కురిపిస్తూ ఏటా ఆగస్టు మూడోవారం ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఆగస్టు మూడో వారం మాత్రమే ఫాదర్స్ డే ఎందుకు జరుపుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెనక గుండెలను పిండేసే ఒక కథనం ఉంది. దాదాపు వెయ్యి మంది పిల్లలు అనాధలు అయిన బాధలోంచి పుట్టుకొచ్చింది ఫాదర్స్ డే.

చిన్నారుల బాధలోంచి పుట్టిన ఫాదర్స్ డే
అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అతి పెద్ద గని మౌనింగా. అప్పట్లో ఎంతో మంది ఈ గనిలో పనిచేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకునేవారు. 1907లో డిసెంబర్ 6న ఆ గనిలో అనుకోని ప్రమాదం జరిగి 361 మంది మరణించారు. వారిలో 250 మంది పెళ్లయి,పిల్లలు ఉన్నవారే. ఆ 250 మంది తండ్రుల పిల్లలు దాదాపు వెయ్యి వరకూ ఉంటారు. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి గ్రేస్ గోల్డెన్ క్లేటన్. ఆమెకు తండ్రి అంటే ప్రాణం. తండ్రికి ఈమెనే లోకం. అలాంటి తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులైంది. తండ్రి స్మారకంగా చర్చిల్లో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయించింది. ఎన్ని చేయించినా ఆమెకు తృప్తిగా అనిపించలేదు. ఎందుకంటే ఆమె పుట్టిన వెంటనే తల్లి చనిపోతే అన్నీ తానై పెంచాడు తండ్రి. తనతో పాటు మరో నలుగురు అక్కలను, అన్నదమ్ములను కూడా తండ్రే కంటికిరెప్పలా చూసుకున్నాడు. మళ్లీ పెళ్లిచేసుకోమని ఎంతోమంది చెప్పినా పిల్లలకోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. అలాంటి తండ్రి అకస్మాత్తుగా మరణించేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. తన తండ్రి లాంటి వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే ఆలోచన నుంచి పుట్టినదే ఫాదర్స్ డే . అలా మొదటిసారి 1910 లో జూన్ 19న ఫాదర్స్ డే ను నిర్వహించింది.

100 కు పైగా దేశాల్లో ఫాదర్స్ డే
ఒక అమ్మాయి మొదలుపెట్టిన ఫాదర్స్ డే ఆ ప్రాంతంలో మెల్లగా ప్రాచుర్యం పొందింది. 1966లో అమెరికా ప్రెసిడెంట్ కూడా ఫాదర్స్ డే నిర్వహించాలని అధికారికంగా ప్రకటించారు. అలా ప్రతి సంవత్సరం ఆగస్టు మూడో ఆదివారం ఫాదర్స్ డే నిర్వహించడం మొదలుపెట్టారు. అమెరికా నుంచి ఇతర దేశాలకు కూడా ఈ ప్రత్యేక దినోత్సవం పాకింది. తన తండ్రికి విషెస్ చెప్పడంతో పాటు ఒక అందమైన బహుమతిని కొనిస్తారు పిల్లలు. ప్రస్తుతం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని 100కు పైగా దేశాల ప్రజలు నిర్వహించుకుంటున్నారు. అలా ఫాదర్స్ డే ని మొదటిసారి నిర్వహించుకున్న దేశంగా అమెరికా చరిత్రకెక్కింది.

నాన్నంటే ఫ్రెండ్!
ఇప్పుడు ఎదిగిన పిల్లలకి నాన్నంటే ప్రెండ్. అమ్మతో చెప్పని చెప్పలేని సంగతులు కూడా ఓపెన్ గా మాట్లాడేంత క్లోజ్. నాన్నంటే ఓ పాతికేళ్ల సహవాసం కాదు జీవితకాల సాన్నిహిత్యం. ఎందుకంటే నాన్న తనని తాను అలా మలుచుకున్నాడు. తండ్రిలో దగ్గరతనం పిల్లల్ని మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతుంది. ఒడిదొడుకులు తట్టుకోవడం ఎలాగో నేర్పిస్తుంది. నేనున్నాను అంటూ అన్నింటా వెన్నంటే నాన్న దైర్యం నూరిపోస్తాడు. తెలియకుండానే భయాన్ని దూరం చేస్తాడు. అందుకే చాలామంది పిల్లలకి నాన్నే లోకం.