అందరికీ సమాన గౌరవం – అదే ప్రధానమంత్రుల మ్యూజియం

అందరినీ గౌరవిస్తూ పేరు మార్చితే కాంగ్రెస్ నేతృత్వ ప్రతిపక్షాలకు కోపం వస్తోంది. బీజేపీ విశాల దృక్పధంతో చేసే ప్రతీ పనిలోనూ రంద్రాన్వేషణకు దిగుతూ తప్పులు పడుతోంది. పాతకాలపు వాసనలే కాదు.. ఒక కుటుంబానికే గొరవమంతా దక్కాలన్న సంకల్పం ఆమోదయోగ్యం కాదన్న నిజాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు..

పేరు మార్పు అంతే..

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు పదహారేళ్లు అధికారిక నివాసంగా ఉన్న తీన్ మూర్తి భవన్లో ఏర్పాటు చేసిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోే మ్యూజియం పేరు మార్చాలని నిర్మయించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. నెహ్రూ ఒక్కరే కాదు..ఆయన తర్వాత మోదీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు చేసిన సేవలను వారు ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ అనేక అంశాలను ఈ మ్యూజింయలో ఉంచారు. అందరూ ప్రధానమంత్రుల ప్రయాణాన్ని రాజ్ నాథ్ సింగ్ ఇంద్రధనస్సుతో పోల్చారు. ఇంద్రధనసు అందంగా ఉండాలంటే అందులోని రంగులన్నీ సమపాళ్లలో ఉండాలని చెబుతూ పేరు మార్పుకు కారణాలను రాజ్ నాథ్ వివరించారు. ప్రధానమంత్రులందరి భాగస్వామ్యాలను, సవాళ్లకు వారు ప్రతిస్పందించిన తీరును సొసైటీ కొత్త తరహాలో ప్రదర్శించనుందని రాజ్‌నాథ్‌ అన్నారు.

చరిత్ర లేని వాళ్లంటూ కాంగ్రెస్ విమర్శలు

కేంద్రంలోని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రతీకార చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పేరు మార్పుతో మహనీయుల జ్ఞాపకాలు మరుగున పడిపోయే అవకాశం లేదని ఆయన చెప్పుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అల్పబుద్ధికి, నిరంకుశ ధోరణికి ఇదీ నిదర్శనమని ఖర్గే అన్నారు. దేశ ప్రగతిలో నెహ్రూ భాగస్వామ్యాన్ని చెరిపెయ్యాలనుకుంటున్న వారు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీని చదవాలని కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కు విజన్ లేక అజీర్తి పెరిగిపోయిందన్న నడ్డా

ఒక కుటుంబాన్ని దాటి చాలా మంది నేతలున్నారన్న సంగతి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. దేశ నిర్మాణంలో ఆ కుటుంబాన్ని దాటి చాలా మంది నేతలు అవిరళ కృషి జరిపారని ఆ సంగతిని అర్థం చేసుకోలేక కాంగ్రెస్ కు అజీర్తి పెరిగిపోయిందని నడ్డా అన్నారు. ప్రధానమంత్రుల మ్యూజియం లేదా పీఎం సంగ్రహాలయలో ప్రతీ మాజీ ప్రధానికి తగిన గౌరవం దక్కిన మాట వాస్తవం. నెహ్రూ సంబంధించి ఉన్న ఒక సెక్షన్ ను కదిలించలేదని నడ్డా గుర్తు చేసినప్పటికీ కాంగ్రెస్ ఆ మాటను అర్థం చేసుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీని జనం తిరస్కరించినప్పటికీ ఆ సంగతిని ప్రస్తుత నాయకత్వం అర్థం చేసుకోలేకపోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాల్‌బహదూర్‌ శాస్ర్తి, ఇందిర, రాజీవ్‌, పీవీనరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ తదితర సొంత పార్టీ ప్రధానులను అవమానించడానికీ కాంగ్రెస్‌ వెనుకాడటం లేదని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది వ్యాఖ్యానించి వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.