నవవసంతాలు – నవకుసుమాలు : తొమ్మిదేళ్లలో మెడికల్ కాలేజీల విప్లవం !

ఆరోగ్యమే మహాభాగ్యం. గతంలో ఢిల్లీలో వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ నివాదం ఇస్తూ గడిపేశాయి. కానీ ఆ మహాభాగ్యాన్ని ప్రజలకు ఎలా ఇవ్వాలన్న ఆలోచనను ప్రధాని మోదీ చేశారు. అందుకే మెడికల్ కాలేజీల విప్లవం వచ్చింది. తొమ్మిదేళ్ల కిందట దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని… అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లెన్ని.. ఇప్పుడు ఎన్ని అందుబాటులో ఉన్నాయి…. ఈ లెక్కలన్నీ మోదీ ముందు చూపును .. ప్రజల కోసం.. దేశం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంత గొప్పగా ఉంటాయన్నది అర్థం అవుతుంది.

కరోనా లాంటి విపత్తులొచ్చినా తట్టుకునేలా వైద్య రంగం

దేశంలో మరో ప్రధాని ఎదుర్కోనన్ని సవాళ్లను ఆరోగ్య రంగంలో ప్రధాని మోదీ ఎదుర్కొన్నారు. అందులో కోవిడ్ ఒకటి. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోని అనేక బలహీనతలను బహిర్గతం చేసింది. దానికి భారత్ కూడా మినహాయింపు కాదు. అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రజల్ని కాపాడుకోవడం క్లిష్టమైన విషయం. భారతదేశం స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ .. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలకు అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దలేకపోయింది. ప్రజలు పిట్టల్లా రాలిపోయే పరిస్థితి రాక ముందే మోదీ ప్రభుత్వం మేల్కొంది. పౌరుల సంరక్షణ కోసం ఉద్దేశించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించగలిగింది. మోదీ ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్ల కాలంలో హెల్త్‌కేర్ రంగంలో అనేక మార్పులు చేయడం వల్ల ఇది సాధ్యమైంది.

110 శాతం పెరిగిన మెడికల్ కాలేజీలు

2014కి ముందు పదేళ్లలో కేవలం 150 మెడికల్ కాలేజీలు మాత్రమే నిర్మించారు. గత తొమ్మిదేళ్లలో మా పాలనలో దాదాపు 302 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు కూడా రెండింతలు పెరిగి లక్షకు పైగా అందుబాటులోకి వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో దేశంలో మెడిసిన్‌లో పీజీ సీట్ల సంఖ్య కూడా 110 శాతం పెరిగింది. వైద్య విద్య విస్తరణ కోసం జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేశాం. వెనుకబడిన కుటుంబాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి, వారి పిల్లలు డాక్టర్లు అయ్యేలా చేశారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు కూడా డాక్టర్లు కావాలనే ఉద్దేశ్యంతో తొలిసారిగా భారతీయ భాషల్లో వైద్యవిద్యకు అవకాశం కల్పించడం ఓ చరిత్రగా చెప్పుకో్చచు. ఈ ఏడాది బడ్జెట్‌లో 150కి పైగా నర్సింగ్ కాలేజీలను ప్రారంభించేందుకు నిధులు కేటాయించారు.

వైద్య మౌలిక సదుపాయాలు పెంచడానికి నిరంతర ప్రయత్నాలు

కొత్త వైద్య కళాశాలలను నిర్మించడం, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం హాస్పిటల్ బెడ్‌ల సంఖ్యను విస్తరించడం వంటి ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడి పెట్టింది. ముఖ్యంగా భారతదేశం గత తొమ్మిదేళ్లలో 302 కొత్త వైద్య కళాశాలలను స్థాపించారు. కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో మరో 17 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల మనకు వైద్యులు, ఇతర వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ లోపం భారతదేశంలో నాణ్యమైన ఆరోగ్య సేవలకు ప్రధాన అవరోధంగా ఉండేది. అందువల్ల, గత తొమ్మిదేళ్లలో వైద్య మౌలిక సదుపాయాలు మరియు వైద్య నిపుణులను పెంచడానికి మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసింది.