బీజేపీ అండలేపోవచ్చునని స్వయంగా జగన్ ఓ సభలో చెప్పుకున్నారు. అసలు బీజేపీ ఎప్పుడు అండగా ఉందో చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ చేశారు. కానీ ఆ పార్టీ నుంచి సౌండ్ లేదు.. కానీ.. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తెరపైకి వచ్చి.. .దేశం కోసం తాము బీజేపీకే మద్దతిస్తామని ప్రకటించారు. వీరి తీరి చూసి బీజేపీలో సెటైర్లు పడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు కూడా వచ్చి తీవ్రమై న ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా ఇలా .. తాము బీజేపీతోనే ఉన్నామని చెప్పుకునేందుకు ఎందుకు తంటాలు పడుతున్నారన్నది అందరికీ వస్తున్న సందేహం.
బీజేపీ – వైసీపీ ఒకటేనని గతంలో ప్రచారం చేసుకుని భారీ లాభం పొందిన జగన్ పార్టీ
బీజేపీకి ఏపీలో సాలిడ్‌గా ఆరేడు శాతం వరకూ ఓటు బ్యాంక్ ఉంటుంది.అయితే బీజేపీ పార్టీలోని వారందరూ చదువుకున్న వారే. రాజకీయ అవగాహన ఉన్న వారే. దీన్ని ఆసరాగా చేసుకున్న వైసీపీ గత ఎన్నికలకు ముందు నుంచే బీజేపీని వ్యూహాత్మకంగా టార్గెట్ చేసింది. తాము, బీజేపీ ఒకటేనన్న ప్రచారాన్ని తమ అనుకూల మీడియా ద్వారా చేసింది. ఈ ట్రాప్ లో అప్పటి విపక్షాలు.,. దానికి సహకరించే మీడియా కూడా పడింది. ఫలితంగా బీజేపీ, వైసీపీ ఒకటే అని అందరూ అనుకునేలా చేశారు బీజేపీ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి చేరేలా చేశారు. ఫలితంగా వైసీపీ ఘన విజయం సాధించింది.
బీజేపీ ఓటు బ్యాంక్ తమకే ఉండేలా వైసీపీ ప్లాన్లు !
ఈ సారి కూడా బీజేపీ ఓటు బ్యాంక్ తమకే ఉండేలా వైసీపీ ప్లాన్లు వేస్తోంది. తమ అరాచక పాలనను కేంద్ర పెద్దలు వ్యతిరికేస్తున్నా… తాము మద్దతుగా ఉంటామని ఆత్మగౌరవం ఏ మాత్రం లేని ప్రకటనలు చేయడమే దీనికి సంకేతం. వైసీపీ నేతలకు ఏ మాత్రం అభిమానం ఉన్నా… మోదీ, అమిత్ షా చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. కానీ.. బీజేపీలో ఉన్న కొంత మంది నేతలపై నిందలేస్తూ.. తప్పించకుని.. బీజేపీ హైకమాండ్ ను పొగిడి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ సారి అలాంటి ట్రాప్ లో .. బీజేపీ పడదని ఆ పార్టీ నేతలు గట్టిగానే ఎదురుదాడి చేస్తున్నారు.
వైసీపీకి ఘాటు కౌంటర్లు ఇస్తున్న సోము వీర్రాజు.. ఇతర నేతలు
తాము బీజేపీకి దగ్గరేనని చెప్పుకోవడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టందుకు ఏపీ బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సోము వీర్రాజు నేరుగా జగన్ తో పాటు మంత్రుల్ని ప్రశ్నిస్తున్నారు. వారెవరూ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రతి రోజూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీ నేతల వద్ద సమాధానం లేకపోయింది. చివరికి ఎన్ని విమర్శలు చేస్తున్నా.. బీజేపీకి తాము దగ్గరేనని చెప్పుకోవడానికి వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదని మంత్రుల ప్రకటనలతో క్లారిటీ వస్తోంది.