భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చేసిన విమర్శలపై స్పందించకుండా వైసీపీ నేతలు చేస్తున్న అడ్డగోలు విమర్శలపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సూటి ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. బీజేపీలోని కొంత మంది నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదివారని కొత్త వాదన తెరపైకి తేస్తున్నారు కానీ.. అసలు అమిత్ షా, నడ్డా చేసిన విమర్శలపై స్పందించడానికి మాత్రం వారికి నోరు రావడంలేదు. ఎందుకంటే అవన్నీ నిజాలేనని విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నారు..
ఏపీలో ఇసుక స్కాం నిజం కాదా ?
ఏపీలో ఇసుక స్కాం బహిరంగం, ఇసుకరీచ్లు తవ్వుకునేం దుకు ఉత్తరభారతానికి చెందిన, నష్టాల్లో ఉన్న జేపి వెంచర్స్ అనే సంస్థ ఇచ్చారు. కానీ పేరుకే ఆ సంస్థ. అంతా వైసీపీ నేతలే తవ్వుకుంటున్నారు. , వైసీపీ నేతలే బినామీగా ఈ సంస్థతో బిడ్లువేయించి అనుమతులు తెచ్చుకున్నారనే ఆరోపమలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించి వైసీసీ అనుకూలురైన వారు కోట్ల రూపాయలు కట్టి సొంతానికి తవ్వకుటున్నారు. ఇష్టారీతిన అమ్ముకుంటున్నారు. అన్నీ నగదు లావాదేవీలే. ఈ స్కాంలో రోజూ కోట్లు చేతులు మారుతున్నాయి. ప్రభుత్వానికి రూ. ఏడువందలకోట్లు వస్తోందని.. వైసీపీ నేతలంటున్నారు. ప్రజల్ని అంతకంటే ఎక్కువగా దోచుకుంటున్నారు
ల్యాండ్ స్కాం అందరికీ తెలిసిందే !
ఆంధ్రప్రదేశ్ భూ దందాలు జరగని ఊరు లేదు. బీజేపీ … ప్రజా చార్జిషీట్ కార్యక్రమం చేపడితే అందులో సగం వైసీపీ నేతలు చేసిన భూదందాలే బయటకు వచ్చాయి. విశాఖలో కొన్ని వేల ఎకరాల్లో వైసీపీ నేతల చేసిన దందాలు అంతా బహిరంగంగానే కనిపిస్తున్నాయి. కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేశారు. ప్రైవేటు భూములపై అధికారం సాక్షిగా దాడి చేశారు. ఇవన్నీ నిజం కాదని వైసీపీ నేతలకు చెప్పుకోవడానికి ధైర్యం లేకుండా పోయింది.
మైనింగ్ ఎవరి చేతుల్లో ఉంది ?
ఏపీలో మైనింగ్ మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లోకి పోయింది. ఎక్కడ చూసినా తవ్వుడే. చివరికి గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ ను కూడా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఎర్రమట్టినీ వదలడం లేదు. మొత్తం పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను కూడా ప్రైవేటుకంపెనీలకు ఇచ్చేశారు. తమ పార్టీ నేతలకు.. బినామీలకు ఈ పన్నులు వసూలు చేసే బాధ్యత ఇచ్చింది నిజం కాదా ? . ఈ మైనింగ్ అక్రమాలపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా అని ఎన్నో సార్లు బీజేపీ ప్రశ్నించినా జగన్ సర్కార్ నోరు మెదపలేదు.
వైన్ పేరుతో పేదల రక్తం పిండేస్తున్న ప్రభుత్వం !
ఏపీలో మద్యం ఆదాయం పాతిక వేల కోట్లు దాటిపోయింది.క్వార్టర్ బాటిల్ పది రూపాయలు కూడా చేయదు. రెండువందల చొప్పున అమ్ముతున్నారు. అదీ కూడా కల్తీ బ్రాండ్లే. అసలైన వర్జినల్ బ్రాండ్లు ఎక్కడా అమ్మరు. వాటిని బ్లాక్ లో వైసీపీ నేతలు అమ్ముకుంటూ ఉంటారు. రాష్ట్రంలో వైసీపీ నేతలుపండిపోయిన వ్యాపారాలు చేస్తోంది అక్రమ మద్యం, ఇసుక రవాణాలో మాత్రమే. కాదని చెప్పే పరిస్థితిలో వైసీపీ లేదంటున్నారు.
బీజేపీ అడిగింది నాలుగు ప్రశ్నలే, నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నవ్వులు పాలవుతున్నారని వైసీపీ నేతలపై విష్ణువర్ధన్ రెడ్డి మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి , మంత్రులు చేతనైతే అమీత్ షా నడ్డా అడిగిన వాటికి సమాధానం చెప్పాలని అంటున్నారు. కానీ వైసీపీ నేతల దగ్గర ఆన్సర్ ఉందా ?