వాస్తు ప్రకారం ఇంటికి ఏ దిశలో ఏం ఉంటే ప్రశాంతత ఉంటుంది!

మన భారతీయ ప్రాచీన విద్యలలో జ్యోతిష్య శాస్త్రంతో పాటూ వాస్తు శాస్త్రం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం అంటే వసతి ఇతి వాస్తుః అంటే ఇళ్లు కానీ , కార్యాలయం కానీ ఏదైనా సరే నివాసాల నిర్మాణాలలో ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలిలాంటి విధి విధానాలను నిర్ణయించేది వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నాలుగు దిశలతో పాటు ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతిలాంటి దిక్కులను కూడా పరిగణంలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా నిర్మాణానికి అనుగుణంగా పరిగణిస్తారు. ఏ దిశలలో ఏ నిర్మాణం ఉండాలంటే..

తూర్పు
సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే కాబట్టి వెలుతురు బాగా వస్తుంది. అందుకని ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు, తోటలు ఉంటే మంచిది. లాంజ్ ఏర్పాటు చేసుకోవాలన్నా, డ్రాయింగ్ రూం లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ దిశలో కట్టుకుంటే బాగుంటుంది.

పడమర
ఈ పశ్చిమ దిశలో ఇంట్లో అయితే స్ఫోర్ట్స్ రూం లాగా లేదా, బెడ్ రూం లాగా, డైనింగ్ హాల్ లాగా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఈ దిశలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక కార్యాలయం విషయానికొస్తే పనిచేసే ఉద్యోగస్తులకు వారివారి సీట్లకు, క్యాబిన్లకు మంచి ప్రాంతంగా ఈ పశ్చిమ దిశ చెప్పబడుతుంది. దీనివల్ల పని సక్రమంగా జరిగే అవకాశాలున్నాయి.

ఉత్తరం
ఉత్తర దిశ సంపదకు సూచకం. అలాగే ఆఫీసు కార్యకలాపాలకు కూడా ఈ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంట్లో అయితే ప్రవేశ ద్వారం, పడక గది, తోట, వాకిలి, బాల్కనీలు, స్విమ్మింగ్ పూల్ లాంటి నిర్మాణాలను కూడా ఈ దిశలో నిర్మించుకుంటే బాగుంటుంది.

దక్షిణం
దక్షిణ దిశ కీర్తి ప్రతిష్టతలను పెంచుతుంది. అందుకని ఆఫీసు కార్యాలయంలో అయితే సీఈఓ చాంబర్ ను ఈ దిశలో పెడితే బాగుంటుంది. ఇంట్లో అయితే మాస్టర్ బెడ్ రూం, లేదా ఎంటర్టైన్మెంట్ గదిలాగా పెడితే బాగుంటుంది.

ఈశాన్యం
నార్త్ ఈస్ట్ దిక్కు (ఈశాన్యం) ఉన్న ప్రాంతం దైవీకానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనది.అందువల్ల ఈ దిక్కున పూజమందిరం కానీ, లేదా ధ్యానమందిరం కానీ, యోగారూం లాంటివి ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈశాన్య దిక్కులో బరువులు అస్సలు ఉంచరాదు. దానివల్ల ఇంట్లో, లేదా కార్యాలయంలో సమస్యలు ఏర్పడతాయి.

ఆగ్నేయం
సౌత్ ఈస్ట్ (ఆగ్నేయం) ప్రాంతం ఎక్కువగా ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వంటగది ఉండడం శ్రేయస్కరం. అగ్నిదేవుడు ఈ దిశకు అధిపతి. ఇక కార్యాలయాల విషయానికి వస్తే ఆఫీసు క్యాంటీన్ కానీ, ఇన్వర్టర్ లాంటి విద్యుత్ పరికరాలను ఇక్కడ ఉంచవచ్చు. అంతేకాదు సృజనాత్మక కార్యకలాపాలకు కూడా ఈ దిశను ఉపయోగించవచ్చు.

వాయువ్యం
నార్త్ వెస్ట్ (వాయువ్యం) ప్రాంతం ప్రధానంగా గాలికి ఆనవాలం. అందుకని ఈ దిశవైపు టాయిలెట్స్, గెస్ట్ రూం, ఎలివేటర్లు, ఏసీలు లాంటివి అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు.

నైరుతి
సౌత్ ఈస్ట్ ( నైరుతి) ప్రాంతం బలమైన ప్రాంతంగా చెబుతారు. ఇంట్లో అయితే వార్డ్ రోబ్ లను ఉంచుకోవచ్చు. ఇక కార్యాలయం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో డిస్కషన్ రూంలు, లేదా సీనియర్ అధికారులకు బెడ్ రూంలు ఏర్పాటు చేయవచ్చు. సౌత్ ఈస్ట కు దక్షిణం వైపున రెస్ట్ రూం లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, వాస్తు శాస్త్ర పండితులు పేర్కొన్న అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం