టీడీపీ ట్రాప్‌లో పడిన వైసీపీ – బీజేపీ పెద్దల్ని బూతులు తిట్టిస్తే ఎవరికి నష్టం ?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పూర్తిగా ఆలౌట్ అయ్యే వ్యూహాలను అమలు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలు వరుసగా ఏపీకి రావడం ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. బీజేపీ అగ్రనేతల్ని తూలనాడుతున్నారు. దీనికి కారణం.. టీడీపీ నేతలు.. బీజేపీ నేతల్ని ఏమీ అనే ధైర్యం లేదా అని టీజ్ చేయడమే. బీజేపీ అగ్రనేతల్ని కూడా బూతులు తిట్టించాలనేది టీడీపీ వ్యూహం. ఆ వ్యూహంలో వైసీపీ ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తోంది.

రాజ్యాంగ పరంగా కేంద్రం నుంచి అనేక కాల సాయాలు పొందిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ సంబంధాలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసి వైసీపీ. తాము బీజేపీకి దగ్గరని చెప్పుకుంది. తమకు బీజేపీ అండ ఉందని కొన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. కానీ వైసీపీ నేతల ప్రజా వ్యతిరేకత పాలన గురించి క్లారిటీ వచ్చాక.. వారు చేస్తున్న వ్యవహారాల గురించి తెలిసిన తర్వాత బీజేపీ నేరుగానే వ్యతిరేకించడం ప్రారంభమయింది. ఏపీలో జరుగుతున్న వ్వహారాలపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది తట్టుకోలేని వైసీపీ నేతలు .. ఇతరులపై ప్రయోగించే భాషను బీజేపీ నేతలపై ప్రయోగించడానికి వెనుకాడటం లేదు.

బీజేపీ అగ్రనేతలను బూతులు తిట్టేందుకు పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్

సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను బీజేపీ పెద్దలపైకి ఉసిగొల్పారు. బూతులతో విరుచుకుపడేలా కొంత మందికి పర్మిషన్ ఇచ్చారు. బయట నుంచి ఎవరి వచ్చి టీడీపీని పొడిగినా.. వైసీపీని విమర్శించినా.. పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరికీ కౌంటర్ ఇవ్వాలనే సిగ్నల్స్ వెళ్తాయి. ఈ సారి కూడా వారిద్దరూ రంగంలోకి దిగారు. పేర్ని నాని పార్టీ ఆఫీసులో కూర్చుని జేపీ నడ్డాపై తీవ్రమైన విమర్శలు చేశారు. కొడాలి నాని కొన్ని మీడియా చానళ్లతో జేపీ నడ్డాపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. వీటిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాపై కూడా వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ .. టీడీపీ ట్రాప్ లో పడిందన్నారు. కానీ వాస్తంగా చూస్తే.. వైసీపీలోనే టీడీపీ ట్రాప్‌లో పడిందన్న అభిప్రాయం వినిపిస్ోతంది.

జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయని జగన్

బీజేపీ అగ్రనేతల విమర్శల తర్వాత సీఎం జగన్ క్రోసూరు సభలో పాల్గొన్నారు. తన సర్కార్ పై ఘాటు ఆరోపణలు చేసిన బీజేపీ అగ్రనేతలకు జగన్ గట్టిగా కౌంటర్ ఇస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని మాత్రం చెప్పుకున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ అండగా ఉందని.. ఇక ముందు ఉండకపోవచ్చన్న అర్థంలో మాట్లాడారు కానీ.. నేరుగా బీజేపీపై ఎటాక్ చేయాలని అనుకోలేదు. బీజేపీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జగన్ కు తెలుసు కాబట్టే ఆయన సైలెంట్ గా ఉన్నారని.. కానీ ఆయన అనుచరుల్ని కంట్రోల్ చేసుకోకపోతే.. బీజేపీ కూడా తగిన సమాధానం చెబుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.