అమెరికా టూర్ – మన్మోహన్ రికార్డ్ దిశగా ప్రధాని మోదీ

అలుపెరుగని బహుదూరపు బాటసారి ప్రధాని మోదీ. ఆయన ఎక్కడికి వెళ్లినా విశాల జనహితం, దేశ ప్రయోజనం గురించే ఆలోచిస్తారు. విదేశీ పర్యటనలకు వెళితే దౌత్య విజయం, పెట్టుబడుల ఆహ్వానం అయన మదిలో మెదిలే రెండు అంశాలు. వెళ్లిన ప్రతీ దేశంలో భారతీయ అమెరికన్లను ఉత్తేజ పరిచి మాతభూమికి సేవ చేయాలని సూచిస్తారు. ఆయన ఉపన్యాసాలు వారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మోదీ మోదీ అన్న నినాదాలతో ఆ దేశం మారుమోగిపోతుంది. మోదీ సమ్మోహనాస్త్రం ఆ దేశాధినేతలపై కూడా పనిచేస్తుంది. మోదీని చూస్తూనే ఆ దేశాధినేతలు సంభ్రమాశ్చర్యాలకు లోనైన సందర్భాలు కోకొల్లలు. కొందరు దేశాధినేతలు మోదీకి పాదాభివందనం కూడా చేస్తున్నారు…

మన్మోహన్ పది సార్లు

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ దిశగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డుకు దగ్గరవుతున్నారు. రెండు పర్యాయాలు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ పది సార్లు అమెరికా టూర్ కి వెళ్లారు.మొదటి పాలనలో ఐదు సార్లు, రెండో పాలనలో అన్నే పర్యాయలు ఆయన యూఎస్ లో పర్యటించారు. మోదీ ఇప్పటికే ఏడు సార్లు అమెరికా వెళ్లొచ్చారు. ఇప్పుడు ఎనిమిదో సారి ఆయన అధికారిక పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మోదీ రాకకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని ఆమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అధికారానికి వచ్చిన నాలుగు నెలల్లోనే 2019 సెప్టెంబరులో మోదీ అమెరికాలో పర్యటిస్తూ అప్పటి దేశాక్షుడు ఒబామాతో ముఖాముఖి చర్చలు జరిపారు. న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో చరిత్రాత్మక ఉపన్యాసం ఇచ్చారు.

సిలికాన్ వ్యాలీకి మోదీ..

2015లో రెండో సారి వెళ్లినప్పుడు సిలికాన్ వ్యాలీని సందర్శించారు. సిలికాన్ వ్యాలీలో భారతీయుల అంకితభావాన్ని వారి చొరవను ప్రశంసించారు. టౌన్ హాల్ సభలో పాల్గొని అందరినీ ఉత్తేజసరిచే ఉపన్యాసం ఇచ్చారు. 2016లో మోదీ రెండు పర్యాయాలు అమెరికా పర్యటనకు వెళ్లారు. తొలి సారి మార్చి – ఏప్రిల్ లో యూఎస్ కేపిటల్ కు ఆయన వెళ్లారు. అణు సంబంధింత సదస్సులో పాల్గొన్నారు. అప్పుడే అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సదస్సులో ప్రసంగించారు. ఈ సారి కూడా ఆయన అమెరికా కాంగ్రెస్ జాయింట్ సెషన్ లో ప్రసంగించబోతున్నారు. రెండు సార్లు ఆ పని చేసిన తొలి భారతీయ ప్రధాని కూడా ఆయనే అవుతారు. 2017లో ఐదోసారి మోదీ అమెరికా వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్నారు. మోదీ తనకు నిజమైన మిత్రుడని ట్రంప్ చెప్పుకున్నారు. 2019లో ఆరో సారి అమెరికా వెళ్లినప్పుడు హూస్టన్ ప్రసంగానికి 50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

కొవిడ్ తో దూరం

కరోనా ఆంక్షల కారణంగా 2020లో మోదీ అమెరికా వెళ్లలేదు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో వర్చువల్ గా ప్రసంగించారు. తర్వాతి సంవత్సరమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లారు.
క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. పలువురు అమెరికన్ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు.

మోదీ ఇప్పటి వరకు ఏడు సార్లు అమెరికా పర్యటనకు వెళి ఎనిమిదో సారికి సిద్ధమవుతుంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆరు సార్లు పర్యటించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి ఐదు సార్లు వెళ్లొచ్చారు.