సౌత్ లో ట్రెండింగ్ విలన్ ‘అర్జున్ దాస్’ గురించి ఈ విషయాలు తెలుసా!

అర్జున్ దాస్..సౌత్ లో ఇప్పుడు ట్రెండింగ్ విలన్. తాజాగా పవన్ కళ్యాణ్ OG మూవీలో ఛాన్స్ కొట్టేశాడు. ఈ విషయం పాతదే అయినా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చింది మాత్రం రీసెంట్ గానే.

పవన్ కళ్యాణ్ ‘OG’ లో అర్జున్ దాస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై RRR తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అర్జున్ దాస్ కూడా నటించబోతున్నాడని కొంత కాలంగా వార్తలొచ్చాయి. తాజాగా అది నిజమే అంటూ మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్ధ అర్జున్ దాస్ ను సినిమాలోకి ఆహ్వానిస్తూ ఓ పోస్టర్ ను షేర్ చేసింది.

అన్నీ హిట్ సినిమాలే
కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్యే ‘బుట్టబొమ్మ’ అనే తెలుగు మూవీలో నటించాడు. తాజాగా క్రేజీ ప్రాజెక్టు ‘OG’లో జాయిన్ అవుతున్నాడు. ఇదే విషయాన్ని అర్జున్ దాస్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. చాలా మంది నన్ను ‘OG’లో ఉన్నారా? అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అధికారికంగా చెప్తున్నాను. అవును. నేను ‘OG’లో ఉన్నాను. ఈ సినిమాలో అవకాశం కల్పించిన సుజీత్ గారికి, దానయ్య గారికి, పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు!” అని అర్జున్ దాస్ పోస్ట్ పెట్టాడు.

లక్షల్లో జీతం వదులుకుని నటనవైపు
గంభీరమైన గొంతుతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన అర్జున్ దాస్ ఏడాది లో 7 సినిమాల్లో నటించాడు. తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన ‘ఖైదీ’. ఆ తర్వాత విజయ్ ‘మాస్టర్’..ఆ తర్వాత ‘విక్రమ్’ లో ఉన్నాడు. తెలుగులో నేరుగా నటించిన మూవీ ‘ఆక్సిజన్’
1990లో చెన్నైలో జన్మించిన అర్జున్ కి చిన్నప్పటి నుంచీ నటనంటే ఇష్టం ఉన్నప్పటికీ..కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగంలో సెటిలయ్యాడు. దుబాయిలో బ్యాంకు ఉద్యోగం సాధించి లక్షల్లో జీతం అందుకున్నాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత..మళ్లీ తనకు ఇష్టమైన నటనవైపు అడుగేశాడు. మొదటి సినిమా ‘పెరుమాన్’..ఈ మూవీలో మెయిన్ రోల్ చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఖాళీ సమయం దొరకడంతో షార్ట్ ఫిలింలో నటించాడు.. అలా షార్ట్ ఫిల్మ్ లో నటన చూసిన లోకేష్ కనగరాజ్ ‘ ఖైదీ’లో నటించే ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయాడు.