అమిత్ షా డైరెక్ట్ అటాక్.. అడకత్తెరలో ఉద్ధవ్ ఠాక్రే

కేంద్ర హోమ్ అమిత్ షా దృఢనిశ్చయం ఉన్న నాయుకుడు. ప్రభుత్వంలో నెంబరు టూ స్థానంలో ఉన్న ఆయన ఏ అంశంపైనైనా స్పష్టతనిస్తూ మాట్లాడతారు. ఎవరినీ మోసంచేయరు. రాజకీయ వంచకులంటే ఆయనకు అసలు గిట్టదు. వాళ్లను ఆయన అసహ్యించుకుంటారు. ఆడిన మాట తప్పిన వారిని కడిగి పారేసేందుకు అమిత్ షా వెనుకాడరు.

ఉద్ధవ్ తీరును ఎండగట్టిన షా

అమిత్ షా మరోసారి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీరును ఎండగట్టారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే ముందుగా చేసుకున్న ఒప్పందాలను, శివసేన సిద్ధాంతాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. పదవి కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నేతల ఒళ్లో కూర్చున్నారని ఉద్ధవ్ పై ఆయన ఆరోపణలు సంధించారు.

ముందు మాట్లాడుకోలేదా..

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు జరిగిన ఒప్పందాన్ని అమిత్ షా మరో మారు గుర్తు చేశారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఠాక్రే ఒప్పుకున్న తర్వాతే సీట్ల సర్దుబాటు జరిగిందని ఆయన చెప్పారు. దేశంలో మోదీ, మహారాష్ట్రలో ఫడ్నవీస్ నాయకత్వానికి ఓటెయ్యాలని ప్రచారం చేశామని అది ఫలించి మెజార్టీ సీట్లు తమకు వచ్చాయని షా ప్రస్తావించారు.

అయినా కేవలం కుర్చీ కోసం ఠాక్రే ప్రత్యర్థి వర్గంలో చేరారని ఆయన అన్నారు. బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నందనే ఎన్డీయే సమర్థంగా తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుందని అమిత్ షా అన్నారు. మోదీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో కూడా దేశంలో, మహారాష్ట్రలో జయకేతనం ఎగురవేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

ఠాక్రేపై జనం విసిగుపోయారు..

మాటల తూటాలు పేల్చడంలో అమిత్ షా దిట్ట అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి ఠాక్రేపై కూడా అదే రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ తీరుపైనా, ఆయన ఒంటెత్తు పోకడలపైనా జనం విసిగిపోయినందునే అధికారం నుంచి దించేశారని అమిత్ షా అన్నారు. శివ సైనికులు కూడా ఆయనపై ఆగ్రహం చెందుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల విశ్వసనీయతను పొందిందన్నారు. అందుకే పార్టీ ఎన్నికల చిన్నమైన బాణం వారికి దక్కిందన్నారు. అదే రియల్ శివసేన అని కోర్టు గుర్తించిందన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చడానికి కూడా ఠాక్రే ఒప్పుకోలేదని కాంగ్రెస్ కు కోపం వస్తుందన్న భయం ఆయనకు ఉండేదని అమిత్ షా ఆరోపించారు. అధికారం నుంచి దిగిపోయే ముందు ప్రజల సింపథీకి మాత్రమే ఆయన నగరాల పేర్లు మార్చారని గుర్తు చేశారు. రెండు పడవల మీద కాలు పెట్టి ఠాక్రే రెంటికీ చెడ్డ రేవడయ్యారన్నారు. ఇప్పటికైనా ఉద్ధవ్ ఠాక్రే తన మనసు మార్చుకుని ప్రజల కోసం పనిచేయాలని అమిత్ షా హితవు పలికారు.