ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా తీరుపై విమర్శలు గుప్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పై పేర్ని నాని, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
నిజాలు మాట్లాడితే బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారుని. పనికి మాలిన వాళ్లనే కదా మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి పీకేసిందని ప్రశ్నించారు. నోరు చేసుకోవడాకి తప్ప ఎందుకూ పనికి రారనే కదా మిమ్మల్ని షెడ్డుకు పంపిందని గుర్తు చేశారు. మీరు కూడా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మాట్లాడేవారేనా అని ప్రశ్నిచారు.
నడ్డా చేసిన విమర్శల్లో ఒక్క తప్పు అయినా ఉందా ?
శ్రీకాళహస్తి సభలో జేపీ నడ్డా చేసిన విమర్శల్లో ఒక్కటైనా తప్పు ఉందా ? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక, మద్యం దోపిడీ నిజం కాదా ? పుట్ట పగలడమే మిగిలింది ఎవరికెంత అనేది మొత్తం బయటకు వస్తుందని.. స్పష్టం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయని ఎవరైనా చెబుతారా అని నిలదీశారు. నడిరోడ్డుపై జరుగుతున్న హత్యలు.. నిర్భయంగా తిరుగుతున్న హంతకులకు ఏం సమాధానం చెబుతారన్నారు. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడుల్లో ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పగలరా అని మండిపడ్డారు.
సంక్షేమ పథకాల నిధులు కేంద్రానివి కాదని చెప్పగలరా ?
సంక్షేమ పథకాల్లో కేంద్ర నిధుల్లేవని పెద్ద నోరేసుకుని అరిస్తే నిజమైపోతుందా ? రైతు భరోసా పేరుతో మీరు చేసుకునే ప్రచారంలో సగం డబ్బులు కేంద్రానివి కావా ? అలా కాకపోతే పీఎం కిసాన్ పేరు స్టిక్కర్ ను ఎందుకు వాడుతున్నారో చెప్పాలన్నారు. స్థలాల పేరుతో వేలకోట్లదోపిడీ చేశారు వైసీపీ నతేలు.. కానీ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్లుగా నిరూపించగలరా ? . కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇళ్లు కడుతున్నారు. అందులోనూ అవినీతి. సీఎం జెండాలు ఊపే వాహనాలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో పత్రాలు బయటపెడతారా ? అని సవాల్ చేశారు. కేంద్రం కనికరించకపోతే్ మీకు కూడా జీతాలు రావనే సంగతి మర్చిపోవద్దని చురకలు అంటించారు.
ఏం గొప్పగా పరిపాలించారు ?
ఆర్థిక బాధలు ఉన్నా గొప్పగా పరిపాలిస్తున్నామని పేర్ని నాని చెప్పుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రానికి ఆర్థిక బాధతలు తెచ్చిపెట్టిందే మీరు – ఏం గొప్పగా చేశారు ? అప్పులు తెచ్చి, ప్రజల ఆస్తులు తాకట్టుపెట్టి బటన్లు నొక్కడం తప్ప ! అది కూడా గొప్పేనా ? అని ప్రశ్నించారు. ఓట్లేసిన ప్రజల్ని మద్యం, ఇసుక, ఇళ్ల రుణాలు.. ఇలా అన్నింటి పేరుతో దోపిడీ చేయడమే మీరు చేసిన గొప్పనా ? అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నానికి విష్ణువర్ధన్ రెడ్డిఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు ముఖాల మీద ఖాండ్రించినట్లు కాదా ? అని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం.. ఇప్పడే ఏముంది .. ముందుంది ముసళ్ల పండగ అని తేల్చి చెప్పారు.