ఏపీ బీజేపీ ప్రజాపోరు – ఎన్నికల వరకూ ప్రజల్లోనే !

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు , కేంద్ర ప్రభుత్వం ( చి వచ్చే నిధులు రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి. వాటి గురించి తెలిపేందుకు బీజేపీ ప్రజాపోరు యాత్ర చేయనుంది. ఇప్పటికే చేపట్టింది. 2024 ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ ఎన్నికల లక్ష్యంగా ప్రజా పోరు రథ యాత్ర చేసింది. ప్రస్తుతం అధికార పార్టీ యొక్క వైఫల్యాలను చెప్తూ .. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో వివరించడమే తన లక్ష్యంగా ముందు ముందు ప్రజాపోరు యాత్ర చేపట్టనున్నారు.

కేంద్ర నిధుల వల్లే ఏపీలో పథకాలు

కేంద్రం అందిస్తున్న నిధుల వల్లనే ఏపీలో పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని రానున్న రోజుల్లో బీజేపీకి ఓటు బ్యాంకుగా మార్చుకునే లక్ష్యంతో ఉన్నట్లుగా ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారంలో విఫ లమయ్యాయని ఏపీ బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజాపోరు యాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధా నాలపై పోరాటాలకు ప్రజలను సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రజలకు వాస్తవాలు చెబితే చాలు బీజేపీకి ఆదరణ

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల జీవితాల్ని మార్చిందని.. ప్రజాపోరు యాత్ర ద్వారా మండల పరిషత్‌, గ్రామ పంచాయతీలు విడుదలైన నిధులను సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కాజేస్తుందో ప్రజలకు తెలిసేలా చేయాలనుకుంటున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14, 15 ఫైనాన్స్ నగదు అంతా కూడా సర్పంచులు పని చేయకుండా గ్రామాల అభివృద్ధి కుంటుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సర్పంచులకు తెలియకుండా గ్రామ అభివృద్ధి చేయకుండా ఎటువంటి కుట్రలు చేస్తుందో దాన్ని వివరించే ప్రయత్నం ప్రజాపోరు యాత్రలో చేస్తారు.

ఇప్పటికే ఓ సారి ప్రజాపోరు యాత్ర !

ఇప్పటికే ఓ సారి ప్రజాపోరు యాత్రను బీజేపీ నేతలు చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ ఈ ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికల మూడ్ వస్తుంది. మరోసారి ప్రజాపోరు యాత్ర ప్రారంభించి ప్రతీ ఊరూకు వెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రజలకు చేసిన మేలు వివరించి.. వారికి అండగా నిలిస్తే చాలని.. వారే బీజేపీని ఆదరిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు.