హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. దేశ ఆరోగ్యం బాగుండాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలి. దీని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ప్రధాని మోదీ.. తొమ్మిదేళ్లలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి చూపించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు.
ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యానికి భరోసా
ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పథకం. ఈ పథకం కింద కార్డు కలిగిన వాళ్లు ఆసుపత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించారు. ప్రపంచ దేశాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేస్తున్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా 9 వేల 3 వందలకుపైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించేది జన ఔషధీ కేంద్రాల్లో 15 రూపాయలకే అందిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడారు. దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించారు. పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇండ్లను నిర్మించారు. ఇందిరా ఆవాస్ యోజన కంటే మెరుగైన పథకం. ఇంటి నిర్మాణం కోసం మూడు విడత సాయం చేసేవాళ్లు. అది కూడా కలెక్టరేట్ కు సర్టిఫికేట్ సమర్పించాలి. టెక్నాలజీని ఉఫయోగించుకుని జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారుడికి ఇబ్బంది లేకుండా చేశాం.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ
దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ 10 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్న లక్ష్యానికంటే అధికంగా నిర్మించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద పారిశుధ్యకార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత కంపు కొడుతున్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి శుభ్రం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా శుద్ద మంచినీరు అందించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే కార్యక్రమాలే. గతంలో 7 ఎయిమ్స్ ఉంటే.. మోదీ హయాంలో 15 ఎయిమ్స్ ను కొత్తగా ఏర్పాటు చేశారు. గత 9 ఏళ్లలో 69663 మెడిసిన్ సీట్లను పెంచారు.
ప్రజల ఆరోగ్యం కోసం అనేక పథకాలు
ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో రూ. 2 లక్షల 30 వేల కోట్లు కేటాయించారు. ఇది అంతకు ముందుతో పోలిస్తే రెండింతలు ఎక్కువ ఆరోగ్య రంగానికి మోదీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఆరోగ్య రంగానికి సమగ్ర విధానాన్ని అవలంబించారు. స్వచ్ఛత ప్రచారం, ఉజ్వల యోజన, యోగా, ఫిట్ ఇండియా ఉద్యమం, ఖేలో ఇండియా ఉద్యమం, ఆయుష్మాన్ భారత్ మరియు జన్ ఔషధి కేంద్రం కోసం బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ మరియు వెల్‌నెస్ సెంటర్‌లను ప్రారంభిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ప్రధాని మోదీ రూ. 60 వేల కోట్లకు పైగా కేటాయించడం ద్వారా మొత్తం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.