కృతి సనన్ ప్రభాస్ విషయంలో క్లారిటీ ఇస్తోందా కన్ఫ్యూజ్ చేస్తోందా!

ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ హడావుడే నడుస్తోంది. సినిమా విషయం పక్కనపెడితే ప్రభాస్ కృతి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. అదేం లేదని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన కృతి..తాజాగా మరోసారి తన మాటలతో అందర్నీ కన్ఫ్యూజన్లో పడేసింది..

ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) రాముడు-సీతగా నటించిన సినిమా ‘ఆది పురుష్ (Adi Purush)’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్ గురించి కృతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “జై శ్రీ రామ్” అంటూ మాట్లాడడం మొదలెట్టిన కృతి..” టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తొమ్మిదేళ్ల తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాతో మళ్లీ మీ అందరి ముందుకు వస్తున్నాను. కొన్నిసార్లు మనం సినిమాలను ఎంచుకోవడం కాదు, కొన్ని సినిమాలు మనల్ని ఎంచుకుంటాయి, జానకి పాత్రలో నటించడం అపురూపమైన ఆశీర్వాదం అని చెప్పుకొచ్చింది. సినిమా విషయం చెప్పేసిన తర్వాత ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది కృతి. ప్రభాస్ సైలెంట్ గా ఉంటాడు, మాట్లాడడు అని అంతా అంటుంటారు కానీ అది నిజం కాదంటోంది కృతి. వెరీ స్వీట్ పర్సన్, ఆయన కళ్లలో ప్రశాంతత, స్వచ్ఛత శ్రీరాముడి గుణాలకు ప్రతిబింబం అని భావిస్తున్నానంది. అసలు శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ తప్ప వేరెవ్వరూ ప్రత్యామ్నాయం కాదంది కృతి.

గతంలో కూడా ఓ ప్రచార వేదికపై ప్రభాస్ స్పీచ్ సమయంలో చెమటతో తడిసిపోతుంటే తన చున్నీ తో తుడిచి తననే ఆరాధనగా చూస్తుండిపోయింది కృతి. ఆ సంఘటన తర్వాత నుంచి కృతి సనన్ ప్రభాస్ ని ఆరాధిస్తోందనే ప్రచారం మొదలైంది. ఇద్దరూ పెళ్లిచేసుకుంటారనేంతవరకూ ప్రచారం జరిగంది. ఆ మధ్య బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో కూడా కాబోయే భార్య ఎవరంటూ ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టిన బాలయ్య కృతి ఫొటో ప్రత్యేకంగా చూపించారు. ఇద్దరం స్నేహితులం మాత్రమే అని కృతి కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాజా ఈవెంట్ లో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడి మరోసారి కాన్సన్ ట్రేషన్ తనవైపు తిప్పుకుంది.

బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న కృతి తెలుగులో ‘1 నేనొక్కడినే’ మహేష్ బాబు0 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్’లో నటించింది. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ తో వస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదల కానుంది. ఏదేమైనా గతంలో ప్రభాస్ తో అనుష్క, కాజల్, త్రిష, తమన్నా నటించినా వాళ్లంతా ఇంత ప్రత్యేకంగా మాట్లాడలేదే అంటున్న నెటిజన్లు..కృతి రీసెంట్ కామెంట్స్ తో మరోసారి డిబేట్ స్టార్ట్ చేశారు.