అమిత్ షాతో చంద్రబాబు భేటీలో రాజకీయం లేదు – ఏపీలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందన్న విష్ణువర్ధన్ రెడ్డి

ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు అంటూ విస్తృతంగా జరుగుతున్న చర్చలకు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెక్ పెట్టారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిందిపొత్తుల కోసం కాదని స్పష్టం చేశారు. . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అమిత్ షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని, ఎలాంటి పొత్తు ఉండబోదని తెలిపారు. బుధవారం వేకువజామున సుప్రభాత సేవలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందన్న విష్ణువర్ధన్ రెడ్డి

ఏపి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజేపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చెప్పారు. కేవలం బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల కాలంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. 20 లక్షల ఇళ్లకు కరపత్రాల ద్వారా మోదీ పాలనా విజయాలను తెలియచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 30వ వతేదీ వరకూ ఈ ప్రచారం ఉద్ధృతంగా సాగుతుదని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని వేధించుకు తింటోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా ఏదో ఓ రూపంలో కరెంట్ చార్జీలు పెంచుతున్నారని అన్నారు. నాలుగేళ్ల పాలనలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని.. ఈ వివరాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. అన్ని రకాల అవకాసాలను ఉపయోగించుకుని ప్రజలకు అధికార పార్టి వైఫల్యాలను తెలియజేస్తున్నామమన్నారు.

అగ్రనేతల పర్యటనలకు భారీ ఏర్పాట్లు

ఈ నెల 9, 10 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారని, ఈనెల 11వ తేదీ విశాఖలో జరిగే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారని‌ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యంమని చెప్పిన ఆయన, రానున్న పది నెలల పాటుఅమిత్ షా పర్యటనను బహిష్కరించాలని, అడ్డుకుంటామని, కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించడం బాధ్యతారాహిత్యంమని ఆయన అన్నారు.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని బిజేపి రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు..