నవ వసంతాలు -నవ కుసుమాలు : చైనాకు దడ పుట్టించేలా ఎదిగిన భారత నాయకత్వం !

అంతకంతకు పెరిగిపోతున్న చైనా దూకుడును సమర్థంగా ఎదుర్కొంటోంది భారత్.. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రాదేశిక సమైక్యత పరిరక్షణకు కట్టుబడేలా వృద్ధి చెందింది. భారత్ సరిహద్దు ప్రాంతాలను చైనా నుంచి కాపాడుకోవడంలో గత ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాయి. అయితే ప్రస్తుతం భారత్ సరిహద్దు ప్రాంతాల దురాక్రమణ కోసం చైనా వేస్తున్న దుష్ట పన్నాగాలు ఏ మాత్రం సాగడంలేదు. భారత్ దీటుగా బదులిస్తోంది.

చైనా అక్రమణల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న భారత్

2017 జూన్‌లో డోక్లామ్ సమీపంలో చైనా చేపట్టిన ఒక రోడ్డు నిర్మాణంపై భారత్ సాయుధ బలగాలు చైనాకు చెందిన పీఎల్‌ఏ మూకలు బాహాబాహీకి దిగాయి. భారత్ సరిహద్దుకు సమీపంలో చైనా చేపట్టిన నిర్మాణాలను భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఆపరేషన్ జునెపర్‌లో భాగంగా చైనా రహదారి పనులు నిలుపుదల కోసం భారత్‌కు చెందిన 270 ట్రూప్‌ల సాయుధ బలగాలు, రెండు బుల్‌డోజర్లను సిక్కిమ్ సరిహద్దును దాటి డోక్లామ్‌లోకి అడుగుపెట్టాయి. వారాల పాటు సుదీర్ఘ మంతనాలు, దౌత్యపరమైన చర్చల అనంతరం డోక్లామ్‌లో అనిశ్చితి నెలకొన్న ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్న భారత్, చైనా ప్రకటించాయి. దశాబ్దాల కాలంలో దౌత్యపరమైన వ్యవహారాల్లో భారత్ ఘన విజయాలకు నాంది పలికింది.

ప్రతీ సారి తోక ముడుస్తున్న చైనా

మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి చైనాతో నువ్వా.. నేనా? అన్న తీరుగా భారత్ వైఖరి మారింది. 2020లో తూర్పు లడఖ్‌లో చైనా సైన్యంతో భారత్ బలగాలు నెలల తరబడి ఘర్షణకు దిగాల్సి వచ్చింది. సరిహద్దు వెంబడి భారత్ భూభాగంలో కొంత భాగాన్ని తనదిగా చెప్పుకునే దిశగా చైనా దురాక్రమణకు దిగింది. అయితే స్వదేశీగడ్డపై చైనా దురాక్రమణను భారత్ సాయుధ బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. 2020 జూన్ 15న లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనిక బలగాలు ఘర్షణకు దిగాయి. ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు భారత్ ప్రభుత్వం నివాళులర్పించి గౌరవించింది. చైనా మాత్రం తన వైపు నుంచి ఎంత మంది సైనికులు చనిపోయారనే విషయాన్ని ఇప్పటి వరకు వెల్లడించలేదు.

మోదీ నాయకత్వంలో బలమైన దేశంగా భారత్

కొద్ది సంవత్సరాలుగా, ప్రధాని మోడీ హయాంలో భారత్ విదేశాంగ విధానంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకున్నది. టెర్రరిజాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయడంలో అనాదిగా అనుసరిస్తున్న విధానాలకు అతీతంగా ముందుకు సాగాలనే తన సుముఖతను ప్రదర్శిస్తున్నట్టుగా దేశ సరిహద్దు వెంబడి తూర్పు, పశ్చిమ దిశల్లో సర్జికల్ దాడులను భారత్ చేపట్టింది. బాలాకోట్ వైమానికదాడులతో గతంలో లాగా భారత్ ఇంక ఎంతో కాలం తన గాయాలను తీరిగ్గా కూర్చుంటూ చూసుకోదని, వైరి పక్షాలపై దెబ్బకు దెబ్బ తీస్తుందనే వైఖరిని ప్రపంచం ఎదుట ప్రదర్శించింది.