రూ.190 కోట్లు వెచ్చించి ఇల్లు కొన్న హీరోయిన్

బాలీవుడ్ లో నటిగా, ఐటెమ్ గర్ల్ గా దుమ్మురేపుతోంది అందాల తార ఊర్వశి రౌతేలా. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో కుబేరులుండే ఏరియాలో వందలకోట్లు పెట్టి లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఊర్వశి రౌతేలా అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంది. మోస్ట్ యంగెస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఊర్వశి 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో మెరిసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతోంది. చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాసూ వేరీజ్ ద పార్టీ అంటూ ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి భారీగానే తీసుకుందట. అఖిల్ ‘ఏజెంట్’ లోనూ ఓ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఆమె రామ్-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో ఓ సాంగ్ చేయనుంది. ఆ మధ్య క్రికెటర్ రిషబ్ పంత్ తో ఎఫైర్ అంటూ వార్తల్లో నిలిచిన ఊర్వశి…రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది. ఆ సందర్భంలో రెడ్ కార్పెట్ పై ఉర్వశిని చూసి ఐశ్వర్యారాయ్ అనుకున్నారు కొందరు ఫొటో గ్రాఫర్లు. అంత అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే ఇప్పుడు ఊర్వశి రౌతేలా ఓలగ్జరీ ఇంటిని కొనుగోలు చేయడం..ఆ ఇంటికోసం 190 కోట్లు వెచ్చించడం హాట్ టాపిక్ అవుతోంది.

గత కొన్ని నెలలుగా ముంబైలో తన కోసం కొత్త ఇంటిని వెతుక్కుంటోంది. జుహులోని ప్రముఖ సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే ఉన్న విలాసవంతమైన బంగ్లాను చూసింది. యశ్ చోప్రా మరణం తరువాత ఆయన భార్య పమేలా చోప్రా ఇక్కడే ఉండేవారట. ఆమె కూడా ఏప్రిల్ 20న మరణించింది. ముంబై నడిబొడ్డున ఉన్న ఈ అద్భుతమైన భవనం ఊర్వశికి బాగా నచ్చడంతో భారీగా వెచ్చించేందుకు సిద్ధపడింది. ఈ విలాసవంతమైన ఇల్లు నాలుగు అంతస్తులలో ఉంది. ఇంటీరియర్ డెకరేషన్‌తో పాటు అందమైన గార్డెన్, వ్యక్తిగత జిమ్‌ వరకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయట. గతంలో లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని సెలెస్టే బంగ్లాలో ఊర్వశి ఉండాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే అన్ని వసతులతో సిద్ధం చేసుకుంది. తాజాగా జుహులోని బంగ్లాకు షిఫ్ట్ అయ్యింది. రీసెంట్ జరిగిన ఆమె 29వ పుట్టిన రోజు వేడుకలకు కూడా రూ.93 లక్షలు వెచ్చించడంపై అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు వందలకోట్లు పెట్టి ఇల్లుకొనడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇండస్ట్రీలో ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకుండానే రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొనడం మాటలుకాదంటున్నారు నెటిజన్లు.