నవవసంతాలు – నవ కుసుమాలు : 8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పెట్టుబడి సాయం !

ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి పీఎం-కిసాన్ ప‌థ‌కం గురించి పెద్దగా ప్రచారం కాదు. కానీ రైతు భరోసా గురించి ఎక్కువ చెబుతారు. రైతు భరోసా నిధుల్లో సగం కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ అని మాత్రం చెప్పడం లేదు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు

ఇప్పటికి 13 విడతల ద్వారా సాయం

పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటి వరకూ 13 సార్లు ఇచ్చారు. భారతదేశ రైతులను ఆదుకోవడంలో, వారి జీవనోపాధి లక్ష్యాలను సాధించేందుకు సహాయపడడంలో కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోంది. పీఎం కిసాన్‌ పథకం వల్ల దేశవ్యాప్తంగా రైతులు గణనీయమైన ప్రయోజనాలు అందుకున్నారు. నరేంద్ర మోదీ 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. కొన్ని నిర్దిష్ట మినహాయింపులకు లోబడి, సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్థిక మద్దతు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6000ను మూడు విడతలుగా రూ.2000 చొప్పున నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు.

ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లోకి రూ. 2.25 లక్షల కోట్లు జమ

ఇప్పటివరకు, రూ.2.25 లక్షల కోట్లకు పైగా నగదును 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు, ప్రధానంగా చిన్న & సన్నకారు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ముఖ్యంగా, కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో, అవసరంలో ఉన్న నిరుపేద రైతులను ఆదుకోవడానికి వివిధ విడతల్లో రూ.1.75 లక్షల కోట్లను పంపిణీ చేశారు. ఈ పథకం కింద 3 కోట్ల మందికి పైగా మహిళా రైతులు రూ.53,600 కోట్లుకు పైగా ప్రయోజనం పొందారు. ఈ పథకం ద్వారా అందించిన నిధులు గ్రామీణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాయి, రైతుల రుణ భారాన్ని తగ్గించాయి, వ్యవసాయ పెట్టుబడులను పెంచాయి. రైతులు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ పథకం పెంచింది, దీనివల్ల మరింత ఉత్పాదక పెట్టుబడులు సాధ్యమయ్యాయి.

జీవన ప్రమాణాలు మెరుగు

పీఎం కిసాన్ ద్వారా అందుతున్న డబ్బు లబ్ధిదార్ల వ్యవసాయ అవసరాలు తీర్చడానికి వారి కుటుంబాల్లో విద్య, వైద్యం, వివాహం వంటి ఇతర ఖర్చులను తీర్చడంలో సహాయపడుతోందని తేలింది. దేశంలోని రైతులందరికీ సాగు పెట్టుబడి, ఇంటి ఖర్చులు అందించేందుకు ఈ స్కీమును తెచ్చిన లక్ష్యం చేరుకుంటున్నారు. ఇప్పటి వరకూ పీఎం–కిసాన్‌ స్కీము కింద మొత్తం 14 కోట్ల మంది రైతులు లబ్దిదారులున్నారు. 8.46 కోట్ల రైతు కుటుంబాలకు బెనిఫిట్స్‌ అందాయి. లబ్దిదారులను గుర్తించే బాధ్యతను రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీలకే అప్పచెప్పారు. రెండు హెక్టార్ల దాకా సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ఇన్‌ కంసపోర్ట్‌‌ను ఈ స్కీము కింద అందించాలని మొదట అనుకున్నా ఆ తర్వాత విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ వర్తింప చేయాలని నిర్ణయించారు. గత ఎసెస్‌‌మెం‌ట్‌ ఇయర్‌‌లో ఇన్‌ కంటాక్స్‌ కట్టిన సంపన్న రైతులను మాత్రం స్కీము నుంచి మినహాయించారు.

రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ గత ప్రభుత్వాలు మాటలు చెప్పేవి . కానీ మోదీ ప్రభుత్వం చేతల్లో చూపించింది.