మన దేశంలో సహజ వనరులకు కొరత లేదు. అందులో బొగ్గు ఒకటి. కాంగ్రెస్ హయాంలో ఖనిజాలు, బొగ్గు గనులు వంటి జాతి సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దారాధత్తం చేసేవారు. అందులో జరిగిన అవినీతి గురించి కథలు కథలుగా వెలుగులోకి వచ్చేవి. మోడీ ప్రభుత్వం ఆ సంపదను ప్రజలకు చెందేలా చూడాలని నిర్ణయించుకుంది. అందుకే ఆ రంగంలోకి ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తూ గనులు, ఖనిజ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు తీసుకొచ్చింది.
భారీగా బొగ్గు ఉన్నా వెలికి తీయలేని పరిస్థితి
భారతదేశం 95 ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల స్థాయిలో సామర్ధ్యాలను కలిగి ఉంది. ”మైనింగ్ రంగంలో సంస్కరణలు 55 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తున్నాయి. మైనింగ్ కార్యకలాపాలను పెంచడానికి, ఖనిజ అన్వేషణలో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రైవేట్ రంగాన్ని అనుమంచడం ద్వారా కేంద్రం గొప్ప ముందడుగు వేసింది. కేంద్రం తెచ్చిన సంస్కరణల ప్రకారం నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద వేలంలో వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.
బొగ్గు కొరతతో విదేశాల నుంచి దిగుమతి
. ప్రపంచంలో భూగర్భ బొగ్గు నిల్వలు ఉన్న దేశాలు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనా, భారతదేశాలు. భారత దేశంలో 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో అతిపెద్ద గనులు ఉన్నాయి. దేశంలోని సహజ బొగ్గు వనరులను ఉపయోగించక పోవటంతో బొగ్గు కొరత ఏర్పడి విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇండోనేసియా నుండి అత్యధికంగా బొగ్గు కొనుగోలు జరుగుతున్నది. ఇండోనేసియాలోని రెండు బొగ్గు గనుల్లో టాటా పవర్ వాటా 30శాతం కాగా, మరో గనిలో అదాని పవర్ కి 74శాతం వాటా ఉంది. రవాణా కోసం అదానీ స్వాధీనంలో పోర్టులు ఉన్నాయి. టాటా, అదానీల ప్రయోజనాల కోసం ఇండోనేసియా నుంచి మోదీ ప్రభుత్వం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నది.
కాంగ్రెస్ హయాంలో ఎన్నో అక్రమాలు!
కాంగ్రెస్ ప్రబుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల దోపిడీతోనే ముగిసిపోయేది. ఈ అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది.
సంస్కరణలతో మారిన పరిస్థితి
‘‘ఆత్మనిర్భర్ భారత్’’ స్ఫూర్తిగా వాణిజ్య పరంగా బొగ్గు గనులవేలం మొదటి విడతను మోదీ 2020లో ప్రారంభించారు. ప్రైవేట్ సంస్థల అంతిమ వినియోగంపై ఎటువంటి పరిమితులు లేకుండా బొగ్గు గనుల వేలాన్ని అనుమతించేందుకు ఈ గనుల నుంచి బొగ్గును సొంత వినియోగం, అమ్మకం లేదా మరేదైనా ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. 6వ రౌండ్ వాణిజ్యం బొగ్గు గనుల కింద వేలం వేసిన 29 బొగ్గు గనులకు మంత్రిత్వశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.
బొగ్గు గనుల మంత్రిత్వశాఖ 7వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియను 29-3-23న ప్రారంభించింది. మొత్తం 106 బొగ్గు బ్లాకులు వేలం ఆఫర్‌లో ఉన్నాయి. వీటి నుంచి వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఆ మేరకు అవినీతికి అడ్డుకట్ట పడింది.