ఆ ఐదు విషయాల్లో స్త్రీలను పురుషులు డామినేట్ చేయలేరు!

అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పురుషులు-స్త్రీల స్వభావం, ప్రవర్తనా విధానం గురించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటుంది. అయితే అతి ముఖ్యమైన ఆ ఐదు విషయాల్లో పురుషుల కన్నా మహిళలే ముందుంటారని చెప్పాడు చాణక్యుడు.

తెలివితేటలు
పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే మహిళలు ఎంత కష్టమైన పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ఏదైనా సమస్య ఎదురైతే దానికి పూర్తిస్థాయిలో పరిష్కారం లభించేవరకూ విశ్రమించరట

ధైర్యం
మహిళలు పిరికితనంగా ఉంటారన్న మాటని అస్సలు అంగీకరించడు చాణక్యుడు. మగవారి కన్నా మగువల్లోనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నాజు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భయపడి వెనక్కు తగ్గడం అనే మాటే ఉండదట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మగవారి కన్నా మహిళలకు ధైర్యం ఆరురెట్లు అధికంగా ఉంటుంది.

ఆకలి
వండడంలోనే కాదు ఆకలి, తినడంలోనూ మగవారిని మించి ముందుంటారు మహిళలు. సాధారణంగా ఆడవారి కన్నా మగవారు ఎక్కువ తింటారని అనుకుంటారు కానీ మహిళలకే ఆకలెక్కువ, ఎక్కువ తింటారని చెప్పిన చాణక్కుడు మహిళల శరీర కూర్పు కారణంగా వారికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయన్నాడు.

పొదుపు
చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ మొదలు వంటగదిలో పోపుల పెట్టె వరకూ పొదుపు విషయంలో మహిళల్ని మించి అనిపించేవారే లేరు ఉండరు. మగవారు మహా అయితే జేబులోనో పర్సులోనో డబ్బులు దాచుతారు కానీ మహిళలు డబ్బులు దాచిన చోట్లు పురావస్తుశాఖాధికారులు కూడా కనిపెట్టలేరేమో. షాపింగులు, సరదాల పేరుతో స్త్రీలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారని అనుకుంటా కానీ…పోదుపు విషయంలోనూ అస్సలు తగ్గరు. ఎందుకంటే ఏ వస్తువుకి ఎంత ఖర్చు చేయాలో తెలిసినట్టే ఆదాచేయడంలోనూ ముందంజలో ఉంటారంటాడు చాణక్యుడు.

లైంగిక వాంఛలు
సాధారణంగా శృంగారాన్ని పురుషులతో ముడిపెట్టి చూస్తారు. కానీ మగవారితో పోలిస్తే మగువల్లో లైంగిక వాంఛ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటాయంటాడు చాణక్యుడు. అందుకే మగవారు సంతృప్తి పొందినంత త్వరగా మహిళల్లో ఆ ఫీలింగ్ కనిపించదట. ఇదే విషయాన్ని వైద్యశాస్త్ర నిపుణులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ విషయంలో కూడా పురుషుల కన్నా మగువలదే పైచేయి అని తేలింది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.