జూన్ లో హైదరాబాద్-వారణాసి 6 రోజుల IRCTC టూర్ ప్యాకేజి!

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది పర్యటనలకు ప్లాన్ చేస్తారు. ఇందులో భాగంగా IRCTC పలు ప్రత్యక ప్యాకేజీలను అందిస్తోంది. ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరుతో హైదరాబాద్ నుంచి కాశీకి కొత్త ప్యాకేజీ అందిస్తోంది. ఐదు రాత్రులు, ఆరు రోజులుగా ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ పర్యటన జూన్ 7 నుంచి అందుబాటులో ఉంది. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

మొదటి రోజు
IRCTC గంగా రామాయణ్ యాత్ర జూన్‌ 7వ తేదీన ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం ఉదయం 9.30 గంటలకు బయలుదేరి వారణాసి విమానాశ్రయానికి ఉదయం 11.25 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. భోజనం తర్వాత కాశీ దేవాలయం, గంగా ఘాట్,సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది.

రెండో రోజు
రెండో రోజు సారనాథ్ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుని బిర్లా ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత ఘాట్‌లను సందర్శన, షాపింగ్‌ కోసం సమయం కేటాయిస్తారు. భోజనం త‌ర్వాత రాత్రి వారణాసిలో నిద్రఉంటుంది.

మూడో రోజు
మూడో రోజు వారణాసి హోటల్‌ నుంచి చెకవుట్ అయి అయోధ్యకు బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యలో ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది. రాత్రి అయోధ్యలో బస ఉంటుంది.

నాలుగో రోజు
నాలుగో రోజు ఉదయం అయోధ్య ఆలయాన్ని సందర్శించుకుని మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి బయలుదేరాలి. లక్నోలో రాత్రి బస ఉంటుంది.

ఐదో రోజు
ఇక టూర్‌లో భాగంగా ఐదవ రోజు నైమిశారణ్య దర్శనం ఉంటుంది. అక్కడ దర్శనం ముగించుకున్నాక సాయంత్రం తిరిగి లక్నో వచ్చి రాత్రి అక్కడే బసచేస్తారు.

ఆరో రోజు
ఈ టూర్‌లో చివరి రోజు ఉదయం రోజు బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

టూర్ ప్యాకేజీ ధర
కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.36,850 చెల్లించాల్సి ఉంటుంది
ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.29,900
ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.28,200
5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు చెల్లించాల్సి ఉంటుంది
ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి