ఆంధ్రప్రదేశ్ రెండు ప్రధాన ప్రాంతీ పార్టీలు వందల కోట్ల ఖర్చు పెట్టి..కొన్ని వేల మంది సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతూ ఉంటాయి. వారి పని రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకోవడం కాదు.. ఒకరిపై ఒకరు దండెత్తుకోవడం. తిట్ల దండకాలు అందుకోవడం. కుటుంబాల్ని ఆన్ లైన్ లోకి తెచ్చి పరువు తీసుకోవడం.. మార్ఫింగ్ ఫోటోలతో కేసుల వరకూ వెళ్లడమే వారు చేయగలిగింది. పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు అంటే అసహ్యం పుట్టేలా వీరి పని తీరు ఉంటుంది. కానీ వాటికి భిన్నంగా ఏపీ బీజేపీ సోషల్ మీడియా విభాగం తక్కువ మందితో అయినా ప్రభావంతంగా ప్రజల్లోకి వెళ్తోంది.
ప్రజలకు మేలు చేసే సమాచారాన్ని చేరే వేసే ఏపీ బీజేపీ సోషల్ మీడియా సైన్యం
ఏపీ బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజలకు ఉపయోగపడే సమాచారం తప్ప..ఇతర ఫ్యాన్ వార్స్ పెట్టుకోరు. వారి లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వాటి ద్వారా గరిష్ట ప్రయోజనం ఎలా పొందాలో .. వారికి వివరించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు. అసభ్య వాదనలకు.. ఇతర పార్టీలపై దూషణలకు దూరంగా ఉంటారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారానికి ఏ మాత్రం భయపడరు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు..అవినీతి, ప్రజా చార్జిషీట్లు వంటి వాటి సమయంలో.. సోషల్ మీడియా పని తీరు పార్టీ హైకమాండ్ అభినందల్ని అందుకుంది.
సొంత సైన్యం లేదు.. అంతా స్వచ్చంద కార్యకర్తలే !
బీజేపీకి ఉన్న బలం స్వచ్చంద కార్యకర్తలే. ధనబలంతో ఇతర పార్టీలు వేల కొద్ది సోషల్ మీడియా సైన్యాలను నడుపుతూ ఉంటాయి. కానీ బీజేపీ ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. ప్రత్యేకంగా పెయిడ్ కార్యకర్తల్ని నియమించుకోలేదు.అలా నియమించుకుని ఉంటే.. ఆ పార్టీలకు.. బీజేపీకి పెద్ద తేడా ఉండేది కాదు. అలా చేయడం బీజేపీ విధానాలకు విరుద్ధం. స్వచ్చంగా వచ్చి పని చేసే వారికి మాత్రం పూర్తిస్థాయి అవకాశాలు కల్పిస్తారు. దీని వల్ల నాయకత్వం కూడా పుట్టుకు వస్తుందని అగ్రనేతలు నమ్ముతారు.
విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో మరింత చురుగా సోషల్ మీడియా వింగ్
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీ బీజేపీని మరింత చురుకుగా మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియా వింగ్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది. వర్క్ షాపులు నిర్వహించి బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అవగాహన పెంచుతోంది. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా ఇంచార్జులు చురుగ్గా ఉన్నారు. ముందు ముందు ఇతర పార్టీలకు ధీటుగా ఏఅపీ బీజేపీ సోషల్ మీడియా ప్రభావం చూపించడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.