9 ఏళ్ల దిగ్విజయ పాలన : రోజుకు 28 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం!

మీ స్నేహితుల్ని బట్టి మీరెలాంటి వారో నిర్ధారించుకోవచ్చు. అలాగే మన గ్రామం లేదా ఊళ్లో ఉన్న రోడ్లను బట్టి అభివృద్ధిపై అంచనాకు రావొచ్చు. ఇదే దేశానికీ వర్తిస్తుంది. స్వాతంత్రం వచ్చిన అరవై ఏళ్లలో వేయనన్న రహదారులు బీజేపీ హయాలో కేంద్రం వేసింది. వాజ్ పేయి హయాంలో ప్రారంభమైన స్వర్ణ చతుర్భుజీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో దేశం మొత్తం విస్తరించింది. జాతీయ రహదారులు ఎక్కడ చూసినా మిలమిలా మెరిసిపోతున్నాయి. వేగంగా వాహనాలు దూసుకెళ్లడానికి అవకాశం కల్పిస్తున్నాయి.

50వేల కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారుల నిర్మాణం.

నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది ఏళ్ల నుంచి దేశంలో 50,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు పెరిగాయి. మౌలిక సదుపాయాల రంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమంగా పని చేస్తోంది. వాటి ఫలితమే ఈ రహదారులు. 2014-15 మధ్యలో దేశంలో 97,830 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండేవి.. ఇప్పటికి అంటే 2023 మార్చి నాటికి 145,155 కిలోమీటర్లకు జాతీయ రహదారులు పెరిగాయf.

రోజుకు 28.6 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం

2014-15 కాలంలో రోజు 12.1 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగేది. ప్రస్తుతం అది 28.6 కిలోమీటర్లకు చేరింది. జాతీయ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రహదారులు కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. జీవన మౌలిక సదుపాయాలు పెరగడమే కాకుండా రక్షణ వ్యవస్థ కూడా పటిష్టమవుతుంది. ప్రతి సంవత్సరం 85 శాతం ప్రయాణీకులతో పాటు 70 శాతం వస్తువుల రవాణా రోడ్ల ద్వారానే కొనసాగుతోంది. ఇది రోడ్డు వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియజేస్తోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుర్తించింది.

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రోడ్ వ్యవస్థ

ప్రస్తుతం దేశంలో 63.73 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ప్రపంచంలో ఇది రెండవ అతిపెద్ద రోడ్డు వ్యవస్థ. ఇందులో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరకు రవాణా, ప్రయాణీకుల సమర్ధవంతమైన రవాణాను విస్తృతం చేయడం, దాన్ని ప్రజలను అనుసంధానించడం, ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో జాతీయ రహదారులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దేశంలో జాతీయ రహదారి మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలను అమలు చేసింది. 2014-15 నుంచి 2021-22 మధ్య కారిడార్ ఆధారిత జాతీయ రహదారి అభివృద్ధి విధానం ద్వారా క్రమబద్ధమైన ప్రోత్సాహం కారణంగా జాతీయ రహదారుల నిర్మాణ వేగం స్థిరంగా పెరిగింది.

దేశం దూసుకెళ్లడానికి ఈ రహదారుల నిర్మాణమే కీలకం. మోదీ విజన్ కు ఇది ఫలితం.