శక్తి కేంద్రాలే బీజేపీ శక్తి – ఏ పార్టీకి లేని వ్యవస్థ కమలం సొంతం !

చాలా రాజకీయ పార్టీలకు బూత్ స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు కూడా సాధారణంగా చేసే పని ఇదే. తమతమ బూత్‌ స్థాయిలో ఉన్న ఓటర్లను గుర్తించడం, వారితో మాట్లాడటం, పార్టీకి ఓటు వేసేలా చూడటమే ఈ బూత్ కమిటీల బాధ్యత. చాలా పార్టీలు ఈ బూత్ కమిటీ సభ్యులకు ఓటర్ల బాధ్యతలను కూడా అప్పగిస్తుంటాయి. అయితే, చాలాచోట్ల పార్టీకి ఓటు వేయని కుటుంబాలు, వ్యక్తులనే టార్గెట్ చేస్తుంటారు. బీజేపీలో బూత్ కమిటీలు ఉంటాయి. కానీ వాటిపై శక్తి కేంద్రాలు ఉంటాయి. ఇవే అసలు బీజేపీకి శక్తి కేంద్రాలు.

శక్తి కేంద్రాలు బీజేపీకి బలమైన పునాలు

బీజేపీలో కేంద్ర నాయకత్వం బూత్ కమిటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇ,స్తుంది. నేరుగా పార్టీ అధ్యక్షుడు బూత్ కమిటీలతో టచ్‌లో ఉంటారు. వారు ఎక్కడుకు వెళ్లినా బూత్ కమిటీలతో సమావేశం కాకుండా ఉండరు. కేంద్ర నాయకత్వం పోలింగ్ బూత్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశిస్తూ ఉంటుంది. ఈ బూత్ కమిటీల పని తీరును విశ్లేషించడానికి నాలుగైదు బూత్‌ లకు కలిపి ఓ శక్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. ిలాేపీలో 15 వేల శక్తి కేంద్లు ఉన్నాయి.

మోదీ కూడా ఓ శక్తి కేంద్రానికి ఇంచార్జి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వారణాసి నియోజకవర్గంలో ఒక శక్తి కేంద్రానికి ఇన్‌చార్జి. ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాని నుంచి మంత్రులు, ఎంపీల దాకా అందరూ మైక్రో మేనేజ్‌మెంట్‌లో భాగమైన శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలకు ఇన్‌చార్జులుగా, పన్నా ప్రముఖ్‌లుగా వ్యవహరిస్తూ తమకు అప్పజెప్పిన బాధ్యతల్ని పూర్తి చేస్తుంటారు.

పన్నా ప్రముఖ్ వ్యవస్థ ఏ పార్టీకీ లేదు !

పన్నా ప్రముఖ్‌ బీజేపీ వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. వారి లక్ష్యం ఒక్కటే. ఆ లక్ష్యం కూడా చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండటమే ఈ వ్యవస్థ ప్రత్యేకత. బీజేపీ ఎన్నికల వ్యూహంలో మైక్రో మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పన్నా ప్రముఖ్‌, బూత్ కమిటీ, శక్తి కేంద్రాలు.. ఇవన్నీ ఈ మైక్రో మేనేజ్‌మెంట్‌లో భాగం. వీటిలో ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యతలు అప్పగించారనేది దిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచి ఆపరేట్ చేసే పోర్టల్‌లో పొందుపరుస్తుంటారు.

బీజేపీ విజయాల వెనుక ఈ మైక్రో వ్యూహమే కీలకం.

త్రిపురలో 25 ఏళ్లపాటు తిరుగులేకుండా పాలిస్తున్న కమ్యూనిస్టు కంచుకోటను 2018లో బీజేపీ బద్దలుకొట్టింటి. అంతకు ముందు ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 2018లో మాత్రం 60 సీట్లలో 34 సీట్లు గెలుచుకోవడమే కాకుండా గత ఎన్నికలతో పోలిస్తే 41.5 శాతం అధికంగా ఓట్లను సాధించుకుంది. ఇటీవల మరోసారి విజయం సాధించింది. యూపీలో సహా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో విజయాల వెనుక ఈ శక్తి కేంద్రాల పాత్ర కీలకం. ప్రధానిస్థాయి దగ్గరనుంచి కింది వకరకూ బీజేపీ బలంగా .. సానుభూతి పరులందరితో ఓట్లు వేయించుకోవడంలో ఈ వ్యవస్థ కీలకం.