ఏపీలో బీసీలకు అండగా బీజేపీ – విస్తృతంగా ప్రజల్లోకి నేతలు!

దేశంలో బీసీ వర్గాలకు అండగా బీజేపీ ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన వారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిని లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లోని ఓబీసీలంతా బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలుపూతంటారు. అందుకే అక్కడ బీజేపీకి తిరుగులేని విజయాలు లభిస్తూ ఉంటాయి. దక్షిణాదిలో కూడా బీజేపీ..బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ బీజేపీ ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తోంది.

బీసీలకు చేరువయ్యేందుకు బీజేపీ కార్యక్రమాలు !

రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నట్లు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. బీసీ కార్పోరేష న్లు మినహా వారికి చేసిన మేళ్లు లేవంటూ అధికార పార్టీని కా ర్నర్‌ చేస్తోంది. దేశ ప్రధానిగా బీసీ సామాజిక వర్గానికి చెం దిన నరేంద్ర మోడీని ప్రధాని చేసిన పార్టీగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే బీసీలకు చేరవయ్యేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. రాయ లసీమ జిల్లాలకు సంబంధించి కర్నూ లు కేంద్రంగా ఈ నెల 28 బీసీ సమావేశం నిర్వహిస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కే.లక్ష్మణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్రస్థాయి బీసీ నేతలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ఏపీ బీజేపీ కార్యాచరణ రూపొందించింది.

త్వరలో విశాఖలో బీజేపీ బహిరంగసభ !

బీసీలను ఏకతాటిపైకి తెచ్చి వారికి చేసిన మేళ్లను ప్రజలందరికీ తెలిసేలా చేయడానికి వచ్చే నెలలో విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున బీసీలను సమీకరించి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభకు జాతీయ స్థాయి బీజేపీ బీసీ నేతల్ని ఆహ్వానించనున్నారు. ఉత్తరాంద్ర జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో బీసీలను ఆహ్వానించి సభను సక్సెస్ చేయాలనుకుంటున్నారు. కేంద్రం పథకాల వల్ల లబ్ది పొందిన వారందర్నీ బీజేపీ కలిస్తే.. ఖచ్చితంగా వారంతా బీజేపీకి అండగా ఉంటారని పార్టీ వర్గాలు నమ్మతున్నాయి.

మోదీ పాలనా విజయాల ప్రచారంలో బీసీ పథకాలపై ప్రచారం

తొమ్మిది ఏళ్ల మోదీ పాలనా విజయాలపై ఏపీ బీజేపీ నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లనుంది. ఇందులో భాగంగా బీసీలకు కేంద్రం చేసిన మేలు.. వాటికి సంబంధించిన లబ్దిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి.. మోదీ చేసిన మేళ్లను వివరిస్తారు.ఇప్పటి వరకూ .. ఆ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందేమో అనుకుంటున్నారు. నిజానిజాలను వివరించి.. బీసీలను జాగృతం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు.