ప్రజాసేవలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. పూర్తిగా ప్రజల కోణంలోనే పరిపాలన సాగింది. దేశం కోసం..దేశ ప్రజల కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకుంది. ఉచితాలు పంచి పెట్టడమే ప్రభుత్వ విధానం కాదు. ఆ ఉచితాలు పేదల జీవితాల్ని మెరుగుపరిచేలా ఉండాలన్న లక్ష్యంతో నిర్ణయాలు జరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు. ఫలితాలు 9 ఏళ్ల పాలనలో ఎన్నో కనిపించాయి.
సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం .. మోదీ పాలనలో కీలక సూత్రాలు
సేవ, సుపరిపాలన, గరీబ్ కల్యాణ్ అనే మూడు ప్రాథమిక సూత్రాలు ప్రధాని మోదీ పాలనలో కీలక. మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ టీకా పరిశో ధన నుండి దాని సరఫరా వరకు ముందుండి నడిపించిన విధానం గురించీ, ఆయన చూపిన చొరవ, అవిశ్రాంత కృషి గురించీ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. రెండవది సుపరిపాలన కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు. మూడవదీ, అత్యంత ముఖ్యమైనదీ పేదలకు అండగా ఉండటమే. సహకార సమాఖ్య ద్వారా… మౌలిక వసతుల కల్పన, సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేపట్టిన అనేక రకాల పథకాలు… అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు జరగాలని ప్రధాని భావించారు. అందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని నిర్ధరించారు.
మౌలిక సదుపాయాలపై రూ. కోటి కోట్ల వ్యయం
9 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దేశంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. 2014–22 వరకు 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అభివృద్ధి వ్యయం రూ. 90.9 లక్షల కోట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాదిలో మరో పదిహేనులక్షల కోట్లు ఖర్చు పెట్టి
ఉంటారు. ప్రభుత్వం 9 సంవత్సరాలలో ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలపై ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. పాతిక లక్షల కోట్లు పైనే. మూలధన సృష్టి కోసం రూ. 30 లక్షల కోట్లు ఉంటుందని అంచనా
మిషన్ మోడ్‌లో అభివృద్ధి పనులు
సేవా, మౌలిక సదుపాయల కల్పన కోసం ‘మిషన్ – మోడ్’ ఫోకస్ ద్వారా కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చిన నిధులలో 42% నేరుగా రాష్ట్రాలకు బదిలీ అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న 58% నిధులను ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే ప్రశ్న చాలామంది పదే పదే లేవనెత్తుతున్నారు. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాథమికంగా మౌలిక సదుపాయాలను అందించడంలో నిమగ్నమై ఉంది. ‘ప్రధానమంత్రి గతిశక్తి’లో భాగంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఉమ్మడి రవాణా, జల మార్గాలతో పాటు లాజిస్టిక్స్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ వంటి ఏడు అభివృద్ధి రంగాల అభివృద్ధికి సమన్వయం కోసం పునాది వేసింది.
ఆత్మనిర్బర్ లక్ష్యం
వైద్య, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్ లాంటి అనేక రంగాలలో సదుపాయాల కల్పనలో దేశం ‘ఆత్మ నిర్భర్’ స్ఫూర్తితో ముందుకు వెళ్లడం జరుగుతోంది. పేద ప్రజల కనీస అవసరాలపై చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా ‘గరీబ్ కల్యాణ్’ నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచారు. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. దేశ వ్యాప్తంగా 9 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లను అందించాం. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కోసం అర్హులందరికీ 18 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేయడం జరిగింది. 3 వేలకు పైగా హాస్పిటల్స్‌ను ఈ పథకంలో చేర్చి ప్రజలకు వైద్యాన్ని సులభతరం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలలో, ప్రభుత్వ రంగంలోని 132 వైద్య కళాశాలలు, అలాగే ప్రైవేట్ రంగంలో 77 వైద్య కళాశాలలు ఆమోదం పొందాయి.
మొత్తంగా దేశమంటే మట్టి కాదని..దేశమంటే ప్రజలని … వారిి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మోదీ పరిపాలన సాగుతోంది.