మహేష్ బాబుకి పోటీగా సితార – అతిపెద్ద కాంట్రాక్ట్ కి సైన్ చేసిన స్టార్ కిడ్!

సితార ఘట్టమనేని..ఈమె గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నెలల పిల్లగా ఉన్నప్పటి నుంచీ సోషల్ మీడియాలో సితార ట్రెండింగ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ , ఇంట్లో పిల్లల అల్లరి వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది నమ్రత. దీనికి తోడు సితార కూడా అంతే యాక్టివ్ గా తనకంటూ ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకుంది. సితారకు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. అంతేకాదు సితార, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తోంది. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఆమె ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌‌గా మారింది.

చిన్న వయసులోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్టు
చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్ కు సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది.దీనికి సంబంధించిన షూట్ ఇటీవలే మూడు రోజులపాటు ముంబైలో జరిగింది. ఈ పిక్స్ కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పీఎంజే జ్యుయలరీ సితారను తన ప్రచారకర్తగా నియమించడంతో.. ఆమెకు పెద్ద మొత్తంలోనే ఆ సంస్థ చెల్లించనున్నట్టు సమాచారం. సితారతో ఇటీవలే ఓ ప్రచార చిత్రాన్ని కూడా షూట్ చేశారు. గతంలోనూ యానిమేషన్ 3D వెబ్ సిరీస్ ఫెంటాస్టిక్ తారకి సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఈ కార్యక్రమాన్ని అప్పుడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో తన తల్లి నమ్రతతో పాటు సితార పాల్గొంది.

సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్!
సితారకు చిన్నప్పటి నుంచీ మంచి పాలోయింగ్ ఉంది. షూటింగ్ సెట్లలో తరచూ తండ్రితో కనిపిస్తూ, హీరోయిన్లతో ఆడుకుంటూ ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేవి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నారి తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సితార రీల్స్ కి ఫ్యాన్స్ ఎక్కువమందే ఉన్నారు. సితార సందడి చూసినవారంతా త్వరలోనే సినిమాల్లోకి వస్తుందనుకునేవారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది కూడా. అయితే గతేడాది వచ్చిన ‘సర్కారు వారి పాట’ లిరికల్ వీడియోలో మాత్రం సితార తళుక్కున మెరిసింది.

తండ్రిని మించిపోతుందా!
చిన్న వయస్సులోనే సితార ఇలా ఓ మేజర్ జ్యుయెల్లరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా మారడంతో మహేశ్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సితారకు ప్రకటనల్లో కనిపించడం కొత్తేంకాదు…ఇప్పటికే తండ్రితో కలసి కొన్ని కంపెనీలకు సంబంధించిన బ్రాండ్ల వ్యాపార ప్రకటనల్లో పాల్గొంది. అందులో మహేశ్ బాబు, నమ్రత, గౌతమ్ కూడా కనిపించారు. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఆమెకు సింగిల్ గా కనిపించే ఛాన్స్ వచ్చింది. అందరినీ ఆకట్టుకుంటూ యాక్టివ్ గా ఉండే సితార ఇప్పుడు ఓ పెద్ద జ్యువెలరీ కంపెనీకి ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ గా అవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సితార దూకుడు చూస్తుంటే ప్రకటనల్లో తండ్రిని మించిన తనయ అనిపించుకునేట్టే ఉంది…