దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ నిత్యం పాకిస్థాన్ పట్ల మెతక వైఖరి పాటించేది. ఉగ్రవాదులు మీద పడి చంపుతుంటే అమ్మా.. అయ్యా.. అంటూ బతిమలాడుతుండేది. పాక్ దుశ్చర్యలకు ప్రకటనలతో సమాధానం చెప్పి సరిపెట్టేది. జనం చచ్చిపోతుంటే ఏమిటీ తాత్సారమని దేశప్రజలంతా నిలదీసినా కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్లు కూడా ఉండేది కాదు. అందుకే దృఢనిశ్చయమున్న ప్రభుత్వం కావాలని దేశ ప్రజలు నిర్ధారించుకుని మోదీకి ఓటేశారు. ప్రజల ఆలోచనావిధానాన్ని అమలు చేయడమే తన కర్తవ్యమని భావించిన ప్రధాని మోదీ.. తన కార్యాచరణను అమలు చేశారు. అవే సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్పక తప్పదు .
ఏకకాలంలో రెండు వర్గాలు దారికి…
గతం వేరు.. వర్తమానం వేరని మోదీ చెప్పాలనుకున్నారు. ఉగ్రవాదులకు, వారిని ప్రేరేపించే పాకిస్థాన్ కు ఏకకాలంలో బుద్ధి చెప్పాలనుకున్నారు. కొరివితో తలగోక్కుంటే జరిగిదేమిటో పాకిస్థాన్ కు అర్థం కావాలనుకున్నారు. అందుకే 2016 సెప్టెంబరు 28న సర్జికల్ స్ట్రైక్స్ చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించారు. ఉరిలోని ఆర్మీ బేస్ పై మిలిటెంట్లు దాడి చేసి 20 మంది సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా సర్టికల్ స్ట్రైక్స్ చేయడం ఒక వంతయితే.. పాకిస్థాన్ కు మన బలమెంటో చెప్పడం మరో వంతు. ఆక్రమిత కశ్మీర్లోని వేర్వేరు ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఏకకాలంలో దాడులు చేసి పదుల సంఖ్యలో ముష్కరులను హతమార్చుతుంటే పాక్ సైన్యం చేష్టలుడిగి చూడటం మినహా చేసిందేమీ లేదు. జమ్మూకశ్మీర్లోకి చొరబాట్లకు ప్రయత్నిస్తే జరిగేదేమిటో కూడా ఉగ్రవాదులకు భారత సైన్యం చెప్పగలిగింది. భారత ప్రయోజనాలు, భద్రతకు, పౌరుల ప్రాణాలకు భంగం కలిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా పాకిస్థాన్ కు అర్థమైంది. మోదీ పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం అమాంతం పెరిగిపోయింది.
బాలాకోట్ వైమానిక దాడులు
కుక్క తోట వంకరంటారు. పాకిస్థాన్ తీరు కూడా అంతే. సర్జికల్ స్టైక్స్ తర్వాత కూడా అక్కడక్కడా చొరబాట్లు కొనసాగాయి.కొంతకాలం సంయమనం పాటించిన భారత ప్రభుత్వం తర్వాత ఉపేక్షించి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది. 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్లోని బాలాకోట్ పై వైమానిక దాడులు చేసింది. 1971 భారత్ – పాక్ యుద్ధం తర్వాత ఆ దేశ భూభాగంలోకి వెళ్లి జరిపిన మొదటి దాడి ఇది. మోదీ దృఢనిశ్చయానికి బాలాకోట్ దాడి దర్పణం పట్టింది. సర్జికల్ స్టైక్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై జరిగితే.. బాలాకోట్ దాడులు నేరుగా పాక్ భూభాగాన్ని గురిపెట్టాయి. బాలాకోట్ లో ఉన్న జైషే మొహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడిని ఒక ప్రతీకార చర్యగా కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందే పూల్వామాలో ఉగ్రదాడి జరిపి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మిలిటెంట్లు చంపేశారు. బాలాకోట్ వైమానిక దాడిలో ఎంతమంది చనిపోయారో చెప్పుకునేందుకు కూడా పాక్ ఆర్మీ సిగ్గుపడింది. ఎందుకంటే ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
బాలాకోట్ వైమానిక దాడులు భారత సైన్యం మనోధైర్యాన్ని కూడా పెంచాయి ఇంతకాలం రాజకీయ సంకల్పం లేక పాకిస్థాన్ దుశ్చర్యలను సహిస్తూ వచ్చారు. మోదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత తమకు పూర్తి స్వేచ్ఛ లభించిందని సైనిక దళాలు ఉత్సాహంగా ఉన్నాయి మన వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్థాన్ ను దెబ్బకొట్టే ధైర్యాన్ని ప్రదర్శించాయి..
అభినందన్ అప్పగింత
ఆక్రమిత కశ్మీర్లోని సరిహద్దు దగ్గర గగనతలంలో డాగ్ ఫైట్ జరిగినప్పుడు మన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ నడుపుతున్న మిరాజ్ 2000 ఫైటర్ విమానం నేలకూలింది. అభినందన్ పాకిస్థాన్ కు బందీగా చిక్కారు. కేవలం 24 గంటల వ్యవధిలో అభినందన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. హమ్మయ్యా మా జోలికి రాలేదని ఊపిరి పీల్చుకుంది. అభినందన్ ను తిరిగి భారత్ కు అప్పగించడం ఒక రహస్య ఆపరేషన్ అని.. దాని వివరాలు రహస్యంగానే ఉండిపోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఎందుకంటే అదో సైనిక రహస్యం. సైనిక వ్యవహారాలు ప్రజల నోళ్లలో నలగడం కరెక్టు కాదని మోదీ భావించారు. ఆయన నిజమైన దేశభక్తుడు..