హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో చాలా పద్దతులు పాటిస్తుంటారు. పెళ్లికి ముందు తర్వాత చాలా మారిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో…అప్పటి వరకూ ఎలాఉన్నా ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు పెళ్లితర్వాత మాత్రం ఇలా ఉండాలి అలా ఉండాలని చెబుతుంటారు. అది చాదస్తమో, సాధింపో కాదు కొన్ని పాటించడం వెనుకున్న ఆంతర్యం వేరే. కానీ ప్రస్తుత జనరేషన్లో ఆడపిల్లలు చాలామంది పెళ్లికి ముందు పెళ్లితర్వాత పెద్దగా మార్పేమీ ఉండడం లేదు. తాళెందుకు వేసుకోవాలి, మెట్టెలెందుకు పెట్టుకోవాలి, గాజులెందుకులే, మోడ్రన్ గా రెడీ అయి బొట్టు పెట్టుకోవడం ఏంటి అనే రకరకాల ఆలోచనలతో ఉంటున్నారు. అవేమీ తప్పుకాదు కానీ కొన్ని పద్ధతులు పాటించడం వెనుకున్న ఆంతర్యం తెలుసుకోలేకపోతున్నారు. వాటిలో ఒకటి కాలికి మెట్టెలు పెట్టుకోవడం. స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మెట్టెలు. సంప్రదాయ పెళ్లిలో ‘స్థాలీపాకం’ పేరుతో ఓ పద్ధతి ఫాలో అవుతారు. ఆ సమయంలో పెళ్లికూతురి కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. ఈ ఆచారం వెనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా
- పాదం మొత్తం నేలపై మోస్తుంది కానీ వేళ్లు మాత్రం మధ్య భాగంలో కాస్త గ్యాప్ వస్తుంది. ఆ భాగంలోనే నాడీ కేంద్రాలుంటాయి. వాటిని సుకుమారంగా ఒత్తినట్టైతే నాడులు చురుకుగా పని చేస్తాయి
- కాలి బొటన వేలికి ప్రక్క వేలు క్రింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించింది. వివాహితులు మట్టెలను ధరించడం వల్ల రుతుస్రావం సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఆయుర్వేదం ప్రకారం బొటన వేలు పక్క ఉండే వేలుతో గర్భాశయానికి సంబంధం ఉంటుంది. మెట్టెలు ఈ వేలుకు ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి, జననేంద్రియాల సమస్యల నుంచి బయటపడతారు. మహిళల్లో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది.
-సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలకు ఉన్న చాలా గైనిక్ సమస్యలు పెళ్లయ్యాక తగ్గుతూవస్తాయి. అందుకు కారణాలెన్నో..వాటిలో కాలివేలికి పెట్టే మెట్టెలు కూడా ఓ కారణం అంటారు నిపుణులు.
-సంతానలేమి సమస్య ఉన్న పురుషుల కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా ఒత్తిడి కలిగించడంవల్ల ఆ సమస్య నివారణ అవుతుందని చెబుతారు.
-పురుషుల కన్నా స్త్రీలలో కామవాంఛ ఎక్కువట. స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే వారి కోరికలు నియంత్రణలో ఉంటాయని కొన్ని పురాతన గ్రంధాలు చెబుతున్నాయి. - మెట్టెలను వెండితో తయారు చేస్తారు. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఇవి భూమిలోని శక్తిని శోషణం చేసుకుని శరీరానికి అందిస్తాయి. దీంతో శరీర వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. అంతేకాదు శరీరంలోని ప్రతికూలతలను బయటకు పంపుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.