మోదీకి పాదాభివందనం చేసిన ఆ నేత

ప్రధాని మోదీ..ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. అన్ని దేశాల అధినేతలు నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకోవడానికి మోదీ వైపు చూస్తున్నారు. భారత్ ను ఆర్థికంగా అగ్రగామి దేశంగానూ, ప్రపంచాన్ని శాసించే రాజ్యంగానూ మార్చే దిశగా మోదీ ప్రయత్నాలు అమోఘమని చెబుతున్నారు. అందుకో మోదీ ఎక్కడికి వెళ్లిన ఎర్రతివాచీ స్వాగతం లభిస్తోంది. మా దేశానికి రండి, మమ్మల్ని ప్రోత్సహించండని దేశాధినేతలు క్యూ కడుతున్నారు..

గౌరవించిన జేమ్స్ మరాపే

మోదీకి ‘పపువా న్యూ గినియా’ దేశ ప్రధాని జేమ్స్ మరాపె పాదాభివందనం చేశారు. జపాన్‌లో జరిగిన జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపె విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. విమానం దిగి వస్తున్న ప్రధాని మోదీకి ఆత్మీయ ఆలింగనం చేసిన జేమ్స్ మరాపె.. ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రధాని మోదీ జేమ్స్‌ను పైకి లేపి భుజం తట్టి కౌగిలించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీకి తమ దేశ అధికారులు, రాజకీయ నేతలను జేమ్స్ మరాపె పరిచయం చేశారు.ఒక భారత నేతకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.

భారత సంస్కృతికి పెద్ద పీట

నిజానికి పాదాభివందనాలు లాంటి సంస్కృతీ సంప్రదాయాలు ఆఫ్రికా దేశాల్లో లేవు. పెద్దలను గౌరవించేందుకు పాదాభివందనం చేయడం భారతీయుల సొంతమనే చెప్పాలి. అలాంటిది మన సంస్కృతిని అర్థం చేసుకుని, అందులోని ఔన్నత్యాన్ని గ్రహించి పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపె అయన కాళ్లకు దణ్ణం పెట్టేందుకు ప్రయత్నించారు. నిత్యం హుందాగా వ్యవహరించే మోదీ, అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకుని తన స్నేహ హస్తాన్ని అందించారు.

మరాపె ఎవరు

సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది, కానీ ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఈ దేశం తన సంప్రదాయానికి బ్రేక్ వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం రాత్రిపూట ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు. కానీ భారతదేశం ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోదీకి పెరుగుతున్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జేమ్స్ మరాపె 2019 నుంచి గినియా ప్రధానిగా ఉన్నారు. ఆయన పంగూ పాటి రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు. 1993లో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. పర్యావరణ శాస్త్రంలో పీజీతో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గతంలో కేబినెట్ మంత్రిగా సేవలందించారు. తొలుత పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరాపె.. తర్వాత పార్టీ మారి ప్రధాని అయ్యారు. 2020లో ఆయన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. భారతీయులన్నా, భారతీయ సంస్కృతి అన్నా తనకు అభిమానమని మరాపె చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు…