సాధారణంగా ఇమ్యూనిటీ కోసం డ్రైఫ్రూట్స్ తింటుంటారు. వాటిలో ఎన్నో పోషకాలతో పాటూ మంచి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. వీటన్నింటిలో ఎండు ఖర్జూరాలు ఇంకా మంచివి. మిగిలిన డ్రైఫ్రూట్స్ కంటే వీటిలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తింటుంటారు.ఇంకా ఇవి తినడం ద్వారా కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తందంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇప్పుడు అనారోగ్య సమస్యలకు వయసుకి సంబంధం లేదు. కాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తున్నాయనగానే వయసైపోతోంది కదా అందుకే అనేవారు…కానీ ఈ జనరేషన్లో మాత్రం చిన్న పిల్లలు కూడా కాళ్ల నొప్పలు,కీళ్ల నొప్పులు అంటున్నారు. మనం రోజూ చేసే పనుల వలన కావచ్చు లేదా తినే ఆహారం వల్ల కూడా కావొచ్చు. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెడతాయి ఎండు ఖర్జూరాలు.
ఎండు ఖర్జూరాలతో ప్రయోజనాలెన్నో
ఎండు ఖర్జూరాలు రెండిటిని ముక్కలు చేసి వాటిని పాలల్లో వేసి మరిగించాలి. దానిలో పంచదార కానీ బెల్లం కానీ వేయకూడదు. ఇవి కలిపిన పాలల్లో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఎండు ఖర్జూరాలు కలిపిన పాలు రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఖర్జూరాలలో ఉండే ప్రోటీన్లు కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి వాటిని తగ్గిస్తాయి. ఖర్జూరాలలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరాలను తినడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్లు, మూత్ర సంబంధ సమస్యలు వంటివి తగ్గుతాయి. ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినడం వలన ఎండాకాలంలో దాహం తీరుతుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు దృడంగా ఉండేలా చేస్తాయి. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని రోజూ విడిగా తినొచ్చు లేదంటే నీళ్లలో నానబెట్టి తినొచ్చు. ఇంకా పాలల్లో మరిగించుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా శరీరానికి బలం అందుతంది.
ఎండువే కాదు మామూలు ఖర్జూరం కూడా మంచిదే
ఖర్జూరం రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖర్జూరంలో తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
ఖర్జూరాలు ఉండే కెరోటినాయిడ్స్, ఫ్లేనాయిడ్స్, ఫీనోలిక్ వంటి యాంటిఆక్సిడెంట్స్ శరీరంలో వ్యాధి కారకాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఖర్జూరాలు నిత్యం తినేవారికి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ
ఖర్జూరాలు జీర్ణ క్రియ ఆరోగ్యానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ కోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిలోని ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరచడంతో పాటు మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఖర్జూరాలు బ్రెయిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్-బి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి విటమిన్-సిని అధికంగా కలిగి ఉండటం వల్ల చర్మంపై ముడతలు, చారలు రాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఖర్జూరాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…