మొన్న వీధివీధికి..ఇప్పుడు ఇంటింటికి – బీజేపీని చేర్చే బాధ్యతల్లో విష్ణువర్దన్ రెడ్డి !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నెల రోజుల పాటు మరో కీలకమైన ప్రచార కార్యక్రమానికి సిద్ధమయింది. కేంద్ర ప్రభుత్వ 9 ఏళ్ల విజయాల్ని ఇంటింటికి చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించారు. గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల్లో విష్ణు చూపిన చొరవతో .. ఐదు వేలు నిర్వహించాలనుకున్న సభలు కాస్తా ఏడు వేల దాకా జరిగాయి. ఈ సభలను కేంద్ర నాయకత్వం కూడా ప్రశంసించింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం సమన్వయం చేసుకుని మోదీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యతలను అప్పగించారు.

నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లనున్న బీజేపీ !

దేశ ప్రజలందరూ మోదీ ప్రభుత్వపాలనలో ఎంత ప్రయోజనం పొందాలో ఎపీలో ప్రజలు కూడా అంతే పొందారు. అయితే దురదృష్టవశాత్తూ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలు స్టిక్కర్ పార్టలుగా మారాయి. మొత్తంగా పేర్లు మార్చడం..స్టిక్కర్లు అంటించడం తప్ప ఏమీ చేయడం లేదు. ఫలితంగా కేంద్రం ఇచ్చే ప్రయోజనాలన్నీ తామిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. చివరికి ఉపాధి హామీ నిధులు కేంద్రం ఇస్తూంటే.. దానికి కూడా పేరు పెట్టేసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు అవన్నీ కేంద్రం, మోదీ ఇస్తున్న పథకాలు అని ఇంటింటికి వెళ్లాలని చెప్పాలనుకుంటున్నారు.

టాస్క్ ను తీసుకున్న విష్ణవర్ధన్ రెడ్డి !

గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను బీజేపీ నిర్వహించింది. గల్లీ గల్లీలో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. బీజేపీపై అభిమానం ఉన్నా.. ఎలా పార్టీలో యాక్టివ్ కావాలో తెలియని చాలా మంది ఇలాంటి సమావేశాల ద్వారా వెలుగులోకి వచ్చారు. వారందర్నీ పార్టీ ఫోల్డ్ లోకి తీసుకు వచ్చి ఫోర్స్ పెంచడంలో విష్ణువర్ధన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారందరినే మరోసారి యాక్టివ్ చేసి ఇంటింటికి వెళ్లాలా సన్నాహాలు చేస్తున్నారు. నెల రోజుల పాటు మోదీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్ని జోరుగా ప్రజల్ని తీసుకెళ్లడంలో ఇలా ఏర్పాటు చేసుకున్న చైన్ ను యాక్టివ్ చేయబోతున్నారు విష్ణువర్దన్ రెడ్డి. పరిమితమైన వనరులే ఉన్నప్పటికీ పార్టీ కోసం ఎలాంటి కార్యక్రమాన్నైనా టాస్క్ గా తీసుకుని ప్రయత్నం చేయడం విష్ణువర్దన్ రెడ్డి స్టైల్ అనుకోవచ్చు.

నెల రోజుల్లో ఇంటింటికి బీజేపీని చేరిస్తే దశ తిరిగినట్లే !

బీజేపీ నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్తే ప్రజల ఆదరణ ఉంటుంది. కానీ కారణం ఏదైనా అలా క్షేత్ర స్థాయికి వెళ్లే ప్రయత్నాలు గతంలో గొప్పగా జరగలేదు. కానీ గత ఏడాదిన్నరగా మాత్రం.. బీజేపీ సామాన్యుల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రకరకాల టాస్కులు పెట్టుకుని వెళ్తోంది. స్ట్రీట్ కార్నర్ సమవేశాలు .. ప్రజా చార్జిషట్లు తో.. కింది స్థాయి ప్రజల సమస్యల కోసం పోరాడుతోంది. ఇప్పుడు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి.. బీజేపీ పాలనా విజయాలను చెప్పడం ద్వారా.. వారి ఆదరణను మరింత చూరగొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో సక్సెస్ అయితే.. మంచి మార్పు వస్తుందని బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు .