ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనా విజయాల ప్రచార సారధిగా విష్ణువర్ధన్ రెడ్డి – నెల రోజుల పాటు ఇంటింటికి బీజేప !

తొమ్మిది ఏళ్ల కిందట 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ ఈ స్వల్పకాలంలోనే ఎంతో అభివృద్ధి చేశారు. నేడు పేదవాడు ఆకలి అనే భయం లేకుండా ఉన్నారు. పేదలు మధ్యతరగతికి ఎదుగుతున్నారు. పేదరికం నుంచి బయటపడుతున్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలొస్తున్నాయి. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరుగుతోంది. ఈ విజయాలన్నింటనీ ప్రజల ముందు పెట్టాలని ఏపీ బీజేపీ నేతల రోజల పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందు కోసం ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రచార కమిటీని నియమించారు.

మోదీ ప్రభుత్వ విజయాలపై నెల రోజుల పాటు ప్రచారం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవ వసంతరాల విజయాల ప్రచార కమిటీ కన్వీనర్‌గా యువనేత, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. విష్ణువర్ధన్ రెడ్డి కన్వీనర్‌గా ఉండగా మరో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. కోలా అనంద్, గారపాటి చౌదరి, కునిగిరి నీలకంఠ, కాశి రాజు, శిరసన గండ్ల శ్రీనివాసులు, డాక్టర్ శబరి సభ్యులుగా ఉంటారు. వీరంతా పార్టీలో వివిధ పదవుల్లో కీలకంగా ఉంటూ.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలు. గన్నవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మే 30 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల విజయాలపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు కార్యక్రమాలపై ప్రచారం చేయాలని నిర్ణయించారు.

అన్ని వర్గాలనూ కలిసి ప్రచారం చేయాలని నిర్ణయం

ప్రధాని మోదీ పాలనా విజయాలపై ప్రచారానికి నియమితులైన విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ మత పెద్దలు, మాజీ సైనికులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు మొదలైన వారిని సంప్రదిస్తుంది. రైతులు, కూలీలు, పేదలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, యువత, గ్రామీణాభివృద్ధి కోసం చేసిన పనులను ప్రచారం చేయడానికి పార్టీ నేతల్ని, లబ్దిదారుల్ని సమన్వయం చేసుకుంటుంది.నెల రోజుల కాలంలో కేంద్రం రాష్ట్రంలో చేసిన మౌలికమైన అభిృద్ది పనులు, సంక్షేమ పథకాల్లో కేంద్ర నిధుల గురించి ప్రచారం చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు, క్రీడాకారులు, కళాకారులు, వ్యాపారులు, వ్యాపారుల వంటి నిపుణులను ఈ కార్యక్రమమంలో భాగస్వాములను చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వీరు ఎలా లబ్ది పొందారో ఆయా వర్గాలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహి్తారు. మోదీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలుస్తారు. వారి జీవితంలో వచ్చిన మార్పులను అందరికీ తెలిసేలా కార్యక్రమాలను రూపొందిస్తారు.

ఏపీలో అభివృద్ధి సంక్షేమం అంతా కేంద్రానిదే !

ఏపీలో ఓ భిన్నమైన పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం తమ పథకాలుగా అమలు చేసుకుంటూ స్టిక్కర్లు వేస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు చేస్తున్న సాయంలో సగం కేంద్రం ఇచ్చేదే. రాష్ట్రానికి నలభై లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఏపీలో ప్రభుత్వం ఒక్క అభివృద్ది పని చేపట్టడం లేదు. ఎక్కడ ఏ అభివృద్ధి పని జరుగుతున్నా అంటే నేషనల్ హైవేస్ కనీ .. రైల్వేస్టేషన్లు కానీ..ఎయిర్ పోర్టులు కానీ మొత్తం కేంద్ర నిధులతోనే. గ్రామీణ ప్రాంతాల్లో జరిగేపనులకూ కేంద్రమే నిధులిస్తోంది. కానీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్ని 80 శాతం దారి మళ్లిస్తోంది. మిగిలిన వాటితోనే పనులు జరుగుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ నెల రోజుల పాటు ప్రజల ముందు ఉంచి…వారిని చైతన్యవంతుల్ని చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది.

ఇటీవల ఏపీ బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహించింది. కనీసం ఏడు వేల స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహించడంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయన చురుకుదనంగా ఆ కార్యక్రమం విజయవంతమయింది. అందుకే మోదీ ప్రభుత్వ విజయాల ప్రచార కార్యక్రమాల కమిటీకి కన్వీనర్‌గా ఆయనను నియమించాలని నిర్ణయించాం. చురుకైన యువతనేతల కమిటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. మోదీ ప్రభుత్వ విజయాలు.. జగన్ ప్రభుత్వ వైపల్యాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తుంది.