ఐశ్వర్యా రాయ్..ఈ పేరులోనే ఓ మత్తు ఉంది, ఓ వైబ్రేషన్ ఉంది, అందానికి చిరునామా అనే అభిప్రాయం ఉంది. సినిమాల్లో నటించినా నటించకపోయినా…పెళ్లిచేసుకుని తల్లైనా ఆమెకున్న క్రేజ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సేమ్ టు సేమ్. ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించినా మళ్లీ నాజూగ్గా తయారైంది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ మూవీస్ లో నందినిగా నటించి మెప్పించింది. తాజాగా కేన్స్ 2023 ఫిలిం ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసిన ఐశ్వర్యా రాయ్ విషయంలో… కేన్స్ ఫోటోగ్రాఫర్లు రెడ్ కార్పెట్ వద్ద ఎలా కన్ ప్యూజ్ అయ్యారో తెలిస్తే షాక్ అవుతారు.
కేన్స్ 2023 ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈఫెస్టివల్ కి ఎంతమంది వచ్చినా స్పెషల్ అట్రాక్షన్ మాత్రం మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్. రెడ్ కార్పెట్ పై ఐష్ అడుగులు వేస్తుంటే చూడడానికి రెండు కళ్లూ సరిపోవన్నంతగా రెప్పవేయడం కూడా మరిచిపోతారు. ఏజ్ పెరిగినా ఐష్ మెరుపు తగ్గలేదు..ఆమెను చూసి మైమరచిపోనివారూ ఉండరు.దటీజ్ ఐశ్వర్యారాయ్. ఈ ఏడాది కూడా ఐష్ కాస్టూమ్స్ హాట్ టాపిక్ గా నిలిస్తే..మరోవైపు ఇంకో బ్యూటీని చూసి ఐష్ ఐష్ అని అరవడం మరో డిస్కషన్ కి తావిచ్చింది.
బుట్టలు మోయడానికి వెళ్లిందా!
ఈ ఏడాది ఐశ్వర్యారాయ్ బుట్టబొమ్మలా రెడీ అయింది. కనీసం గాలికూడా తగలనంతగా ఒళ్ళంతా కప్పి ఉంచే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఆ డ్రెస్ ఓ గొడుగులా ఉంది..కేవలం ముఖం మాత్రమే కనిపిస్తోంది.క్లోజప్ లో చూస్తేకానీ ఐశ్వర్యారాయ్ ని గుర్తించలేరు. సోషల్ మీడియా మొత్తం ఐష్ ఫొటోలతో నిండిపోయింది…అవి చూసిన నెటిజన్లు ఇదేం డ్రెస్ బాబోయ్ అని కొందరు, బుట్టలు మోయడానికి కేన్స్ కి వెళ్లిందా మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఇక రెడ్ కార్పెట్ పై ఆమె నడిచి వస్తుంటే ఆ డ్రెస్ ని సరిచేసేందుకు నానా తిప్పలు పడ్డారు అసిస్టెంట్స్.
ఐశ్వర్యారాయ్ కి-ఊర్వశి రౌతేలాకి తేడా తెలియలేదా?
డ్రెస్ విషయంలో నెటిజన్ల కామెంట్స్ సంగతి పక్కనపెడితే..వేదికపై ఐశ్వర్యారాయ్ కి ఓ అవమానం జరిగింది. నేరుగా కాకపోయినా అవమానమే అని చెప్పుకోలేమో. అసలేం జరిగిందంటే… కేన్స్ ఉత్సవాల్లో భాగంగా భారతీయ భామలు రెడ్ కార్పెట్ పై డిజైనర్ దుస్తుల్లో ఒదిగిపోయారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవ్సతరం కూడా ఐశ్వర్యా రాయ్ వేడకల్లో పాల్గొంది. ఐష్ కన్నా ముందు వేదికపైకి వచ్చి హొయలొలికించింది ఊర్వశి రౌతేలా. ఆమెను చూసిన ప్రెంచ్ ఫోటోగ్రాఫర్లు ఐశ్వర్య ఐశ్వర్య అంటూ పిలిచే సరికి ఊర్వశికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాక కాసేపు అలాగే ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు..తానెవరో చెప్పే ప్రయత్నం చేయలేదు..కానీ కాసేపటికి ఆ ఫొటోగ్రాఫర్లు సరిగ్గా గమనించి ఈమెఎవరు కొత్తగా ఉన్నారంటూ అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఐష్ ఎంట్ర ఇచ్చి రెడ్ కార్పెట్ పై నడించింది. ఎంతో మంది విదేశీ భామలు రెడ్ కార్పెట్ పై మెరిసినా ఐష్ వచ్చిందంటే ఆ వేదిక స్వరూపమే మారిపోతుంది. కేన్స్ ఉత్సవాలకే ఓ బ్రాండ్ ఐశ్వర్య. మరోవైపు ఊర్వశి రౌతేలాకి ఇది కాంప్లిమెంటే అని చెప్పుకున్నా…ఐష్ మాత్రం ఈ ఏడాది అంచనాలను అందుకోలేదంటున్నారు నెటిజన్లు…