జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీకి సంబంధించి రీసెంట్ గా మూడో షెడ్యూల్ ప్రారంభమైంది. న్ ఇండియా రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తారక్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. సీ బ్యాక్ డ్రాప్ లో నాయకుడిగా కొనసాగే కథ ఇది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. జాన్వికపూర్ తెలుగలో ఎంట్రీ ఇస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడంతో మరింత ఇంట్రెస్టింగ్. పైగా బాలీవుడ్ నటులు నటిస్తుండడం వల్ల అటు నార్త్ లో కూడా మంచి హైప్ ఉంది. అన్ని భాషలకి సరిపోయేలా టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారు మూవీ టీమ్. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.
పవన్ పేరు ఎన్టీఆర్ టైటిల్!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు సముద్రఖనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హిట్ మూవీ వినోదయ ‘సీతమ్’ కు ఇది రీమేక్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను పరిశీలించారు. కానీ చివరికి ఈ సినిమాకు “బ్రో” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. దీంతో పవర్ ఫుల్ టైటిల్ దేవర ను ఎన్టీఆర్ కోసం వాడేస్తున్నారు మేకర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పేరు ని ఉపయోగించారు.ఈ పేరుని ఇప్పుడు ఎన్టీఆర్ 30 మూవీ కోసం అదే టైటిల్ ని కొరటాల శివ పెట్టడానికి ఫిక్స్ అయ్యారని టాక్ . మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సర్ప్రైజ్ గా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేయనున్నారని సమాచారం.
వచ్చే సమ్మర్ కి విడుదల!
ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు ప్రముఖ హేర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ రూపొందిస్తున్నారట. రీసెంట్ గా హకీమ్ షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించాడు. కొరటాల శివ సినిమా కోసమే ఈ లుక్ అని ప్రచారం జరిగింది. ‘NTR30’ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.