సోంపు గింజలు మీ ఒంట్లో కొవ్వును ఇట్టే కరిగించేస్తాయి, వీటిని ఎలా తీసుకోవాలంటే!

సుష్టుగా భోజనం చేసిన తర్వాత నాలుగు సోంపు గింజలు నోట్లో వేసుకుంటే నోరు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆహారాన్ని అరగించేందుకు కూడా సహాయపడతాయి. అయితే వీటితో అదనపు కొవ్వు కూడా కరిగించుకోవచ్చంటోంది ఆయుర్వేద శాస్త్రం..

అదనపు కొవ్వు కరిగించేస్తాయి
అధికబరువు…ఇప్పుడు అందర్నీ వేధిస్తోన్న సమస్య. బరువు తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతుంటారు. ఆహారంలో మార్పులు చేసుకుంటారు, అందుకు తగినట్టు జీవనశైలిలో మార్పులు చేసుకుంటారు. అయితే బరువు తగ్గించుకునేందుకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ వంటిట్లో ఉండే సుగంధ ద్రవ్యాలు చాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా అదనపు కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి సోంపు గింజలు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాల గొప్ప మూలం సోంపు గింజలను పోషకాల పవర్ హౌస్ గా పిలుస్తారు. జీవక్రియను పెంచడంలో ఇవి సహాయపడతాయి,శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వుని కరిగిస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఫైబర్ పుష్కలంగా ఉండే సోంపు గింజలు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ఎంజైమ్ ల ఉత్పత్తికి సహకరిస్తాయి. వీటిలో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వల్ల ఎక్కువ సేపు పొట్టని నిండుగా ఉంచి అతిగా తినాలనే కోరికకు చెక్ పెడతాయి.

శరీరంలో విషాన్ని బయటకు పంపుతాయి
సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకి పంపడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. శక్తిని వేగంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. కొవ్వును త్వరగా కరిగించేస్తుంది.

సోంపు గింజల్ని ఎలా తీసుకోవాలి
@ ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకుని అందులో కొన్ని సోంపు గింజలు వేసుకుని రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున టీ లేదా కాఫీ తాగే బదులు ఈ సోంపు వాటర్ తాగొచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
@ హెర్బల్, గ్రీన్ టీలు మాత్రమే కాదు సోంపు గింజల టీ కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వేడి నీటిలో ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసుకోవాలి. వాటిని బాగా మరిగించాలి. రుచి కోసం పుదీనా ఆకులు, అల్లం వేసుకోవచ్చు. రుచి ఘాటుగా అనిపిస్తే అందులో కాస్త తేనె కలుపుకుని టీ తాగొచ్చు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఉబ్బరం తగ్గించడంలో సోంపు గింజలు సహాయపడతాయని ఆలూ అధ్యయనాలు వెల్లడించాయి.
@ అనేక రకాల క్యాన్సర్ లు రాకుండా తగ్గించడంలో ఈ ఫెన్నెల్ సీడ్స్ సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో జింక్, ఫాస్పరస్, సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
@ సోంపు గింజలతో చేసుకునే ప్రత్యేక పానీయం కళ్ళకు చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఆయుర్వేదంలో వీటిని నేత్రజ్యోతి అని కూడా పిలుస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. వైద్యుడు వేదా ఆయుర్వేద నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అనుసరించాలి.