జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలకడ లేని రాజకీయం దారి తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా చేయాలో .. ఎలాంటి ప్రకటనలు చేయాలో ఆయనకు ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదని వరుసగా రెండు రోజుల్లో ఆయన చేసిన ప్రకటనల్లోని వైరుధ్యమే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే మంగళగిరి పార్టీ ఆఫీసులో గురువారం మీడియాతో మాట్లాడిన పవన్ తనకు ఉన్న బలం సరిపోదని.. తాను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని.. అందుకే సీఎం పదవి అడగబోనన్నారు. మళ్లీ తర్వాతే రోజే ఆయన బలం చూపించి సీఎం పదవి డిమాండ్ చేద్దాం అన్నారు. టీడీపీ నేతలను సీఎం చేయడానికి జనసేన లేదన్నారు. అదే సమయంలోబీ బీజేపీ, టీడీపీతో కలిసి వైసీపీని ఓడిస్తామన్నారు. ఆయన తీరు చూసి రాజకీయవర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇంత నిలకడ లేని తనంతో రాజకీయాలు ఏం చేస్తారని అంటున్నారు.
ఓ స్పష్టమైన అభిప్రాయంపై ఎప్పుడూ నిలబడని పవన్ కల్యాణ్
రాజకీయాల్లో ఓ స్టాండ్ మీద ఉంటేనే విలువ ఉంటుంది. అటూ ఇటూ ఊగిసలాడుతూంటే.. చులకన అయిపోతారు. అలాంటి చులకన పవన్ కల్యాణ్ ప్రతీ సారి అవుతూనే ఉన్నారు కానీ తీరు మార్చుకోవడం లేదు. రెండు రోజుల్లో ఆయన చేసిన ప్రకటనలు చూసిన ఎవరికైనా.. ఇదేం రాజకీయం అనిపించక మానదు. ఇంతలా నిలకడలేని వ్యక్తితో ఎలా రాజకీయాలు చేయాలని టీడీపీ సానుభూతిపరులు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం చూస్తూంటే.. పవన్ పై వారికీ నమ్మకం లేదని అనుకోక తప్పదు. పవన్ తీరు వల్ల అసలు రాజకీయంగానే జనసేన లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జన సైనికుల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతోంది.
ఇంత గందరగోళంతో క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేయడం అవసరమా ?
పవన్ ఇలా పొత్తులు.. సీఎం సీటు.. పోటీ చేసే స్థానాలు ఇతర అంశాలపై క్యాడర్ ను గందరగోళం గురి చేయడం ఇదే మొదటి సారి కాదు. ఆయన రాజకీయం అలాగే ఉంది. ఎవరికీ క్లారిటీ ఉండదు. చివరికి ఆయనేక ఉండరు. ఎంతో క్లారిటీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారనుకున్న తర్వాతి రోజే ఆయన మాట మార్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జనసైనికులు.. ఇతర పార్టీలు కన్ఫ్యూజ్ కు గురై జనసేనను మరితం ఇబ్బంది పెడుతున్నారు. పవన్ ను ఇతర పార్టీల ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ గుర్తించడం లేదన్న అభిప్రాయం వినపిస్తోంది.
బీజేపీ పొత్తులపై తేల్చడానికి పవన్ ఎవరు ?
అసలు పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుందని పవన్ మర్చిపోయారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. ఆ పార్టీతో కలిసి పని చేయడం లేదు. ఈ అంశంపై బీజేపీ ఏమీ అభ్యంతర పెట్టడం లేదు. ఆయన రాజకీయాలు ఆయన చేసుకుంటారని చెబుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ పొత్తుల గురించి ఎలా ప్రకటనలు చేస్తారు ? టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే వైసీపీపై గెలుస్తాయని ఆయన బహిరంగ ప్రకటన చేశారు. అసలు బీజేపీ పొత్తులపై హైకమాండ్ ఇంకా ఎలాంటి చర్చలు కూడా ప్రారంభించలేదు. ఏపీలో ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్లో ఒంటరి పోరుకే బీజేపీ సిద్ధమైంది. జనసేన కలిసి వస్తే సరే లేకపోతే మరో కూటమి గురించి ఆలోచించడం లేదు. మరి పవన్ ఎందుకు బీజేపీ ని పొత్తుల రాజకీయాల్లోకి లాగుతున్నారు ? అసలు అసలు సంబంధం ఉందా? రాజకీయాల్లో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తారేమో కానీ ఇలా సంబంధం లేని సంబంధాలు కలిపే ప్రయత్నం చేయడం అవగాహనా లోపమే. పవన్ లో అది ఎక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు ఇందుకే వస్తున్నాయి.
పవన్ ను మరింత కామెడీ చేస్తున్న టీడీపీ !
పొత్తులు.. పొత్తులు అని పవన్ కల్యాణ్ అని హంగామా చేస్తున్నారు కానీటీడీపీ ఒక్క సారి కూడా జనసేనతో పొత్తుల గురించి మాట్లాడలేదు. మీకేంటి తొందర అని ప్రశ్నించిన మీడియాను చంద్రబాబు కసురుకుంటున్నారు కానీ అవును పవన్ కల్యాణ్‌తో కలుస్తామని చెప్పడం లేదు. పవన్ మాత్రమే ఎెగబడి చెబుతున్నారు. పవన్ ఎలాంటి అవగాహన లేని రాజకయం చేసి చులకన అవుతున్నారో ఈ అంశంలోనే స్పష్టత రావడం లేదా ? అన్నది ఎక్కువ మంది ప్రశ్న. అది నిజమే కదా !