పవన్ ను ఫాలో అవుతున్న పూనమ్

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్ అవుతోంది. అహంకారమా అజ్ఞానమా అని పూనమ్ విమర్శలకు జనాల అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు..ఇంతకీ ఏం జరిగిందంటే..

పదకొండేళ్ల తర్వాత హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయి పదకొండేళ్లు పూర్తైన సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. ఏ కాలంలో ధర్మానికి హాని కలుగుతుందో..అధర్మము వృద్ధి చెందుతుందో.. ఆయా సమయాల్లో ప్రతి యుగంలో అవతారాలు దాల్చుచున్నానంటూ ఘంటసాల వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత లుంగీ కట్టుకుని వెనక గన్ పెట్టుకుని చాయ్ చేత పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్ అఫ్జల్ గంజ్ పాతబస్తీ అంటూ పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్ధలైపోతుంది అని చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
అయితే గ్లింప్స్ తో పాటూ విడుదలైన పోస్టర్ పై వివాదం రేగింది. పూనమ్ కౌర్ ట్వీట్ ఇప్పుడు మారుమోగిపోతోంది…

అహంకారమా-అజ్ఞానమా?
ఈ పోస్టర్ లో పవన్ కాళ్ళని మాత్రమే చూపించారు. మూవీ టైటిల్ సరిగ్గా పవన్ కాళ్ల దగ్గర వేశారు. టైటిల్ అక్కడ వేయడం ఏంటని పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మనం స్వాతంత్ర సమరయోధులను గౌరవించక పోయిన పర్వాలేదు కానీ అవమానించకండి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో భగత్ సింగ్ పేరుని కాళ్ళ దగ్గర పెట్టడం ఏంటి? అహంకారామా లేదా అజ్ఞానమా? అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

పూనమ్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్
పూనమ్ తాజా ట్వీట్ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ పై పూనం విమర్శమలు చేయడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ చాలాసార్లు పవన్ కళ్యాణ్ ని ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం, అమ్మాయిలను అడ్డంపెట్టుకుని, జనాల ఇన్నోసెన్స్ తో కొంతమంది ఆడుకుంటున్నారని ఫేస్ బుక్ లో పూనమ్ గతంలో ఒక పోస్ట్ పెట్టింది. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త అతడో నమ్మక ద్రోహి అంటూ ట్వీట్ చేసింది. ఫోకస్ కోసమే పూనమ్ కౌర్ ఇదంతా చేస్తోందని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.