స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో తామే ఏపీ హక్కులను కాపాడుతామని హడావుడి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జేడీ లక్ష్మినారాయణ వంటి వారు కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కుల కోసం గొంతెత్తారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణాబోర్డు మీటింగ్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రయోజనాల కోసం కృష్ణాబోర్డులో మాట్లాడాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
రాజకీయాలు ప్రజల కోసం మీరు వాడుకున్న స్టీల్ ప్లాంట్ కన్నా నీటి సమస్య విస్తృతమైనదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణాజలాల విషయంలో ఏపీకి మద్దతుగా నిలబడి మీ నిజాయితీని నిరూపించుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా కోసం మెడ తెగ్గోసుకుంటాం అన్నట్లుగా స్టీల్ ప్లాంట్ విషయంలో హడావుడి చేసిన జేడీ లక్ష్మినారాయణ ఏపీ బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాల విషయంలో ఆ పట్టుదల చూపించగలరా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ న్యాయమైన నీటి కేటాయింపులపై మద్దతుగా మాట్లాడాలన్నారు. సీమకు చెందాల్సిన నీటిని అనవసర విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలివేస్తున్న వైనంపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ నేతలుగా చెప్పుకుంటున్న నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణాబోర్డుకు ఇచ్చేందుకు అభ్యంతరాలెందుకన్నారు.
ఏపీ నీటిని కూడా కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం
ఏపీకి న్యాయంగా కేటాయించిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. రెండు రాష్ట్రాల మధ్యన 2015 – 16లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల వినియోగంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన 66:34 నిస్పత్తిలో నీటికేటాయింపులు కుదుర్చుకున్నాయి. బచావత్ చేసిన 811టీఎంసీల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టింసీలు వినియోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందమే ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది. అయితే తమకు యాభై శాతం వాటా కావాల్సిందేనని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటోంది. గతంలోలా కాదని కృష్ణా జలాల్లో సగం వాటా కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు.
దిగువ రాష్ట్రమైన ఏపీకి నీరందకుండా ఎందుకు చేస్తున్నారు ?
ఏపీ దిగువ రాష్ట్రం.. చివరికిగా నీళ్లు సముద్రంలో కలిసేది ఏపీలోనే ., అలా కలిసిపోయే నీళ్లన్నింటినీ ఏపీ ఖాతాలో వేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమకు తీవ్ర నీటి ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి విడుదల చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తోంది. నీటీని వృధా చేస్తోంది. ఇవి ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ రాజకీయం చేసిన కేసీఆర్, కేటీఆర్, జేడీ లక్ష్మినారాయణ మాత్రం వీటిపై మాట్లాడటం లేదు.