చార్జిషీట్ ఉద్యమం ఎఫెక్ట్ ఇంత ఉందా ? ఏపీ బీజేపీపైనే ఇంత దుష్ప్రచారం ఎందుకు ?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏమి ఉంది.. ఒక్క శాతం ఓటు బ్యాంక్.. నోటా కంటే ఎక్కువ ఓట్లు రావు అని ప్రకటనలు చేసే పార్టీలు.. అసలు తమ దృష్టి అంతా బీజేపీపైనే పెడుతున్నాయి. దానికి తాజా ఉదాహరణ ప్రస్తుతం ఏపీ బీజేపీపై చేస్తున్న ప్రచార దాడి. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇతర పార్టీలు ఎంతలా భయపడుతున్నాయో.. వాటికి ఉన్న మీడియా, సోషల్ మీడియా సపోర్టుతో చేస్తున్న ప్రయత్నాలే సాక్ష్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఏపీ బీజేపీపై వ్యతిరేక ప్రచారాలు ఎక్కువైపోయాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.. కోవర్టులంటూ కథనాలు రాస్తున్నారు. మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు రెండూ బీజేపీ అంటే ఎందుకు ఇంత భయపడుతున్నాయి ? వారు చెప్పినట్లుగా బీజేపీకి ఒక్క శాతమే ఓటు బ్యాంక్ ఉంటే ఆలోచించాల్సిన అవసరం ఏమిటి ?

అన్ని పార్టీల్లో ఉన్నట్లే ఏపీ బీజేపీ కార్యకలాపాలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓ రాజకీయ పార్టీ. అన్ని పార్టీల్లాగే ఆ పార్టీ వ్యవహారాలు ఉంటాయి. పార్టీ లైన్ దాటితే వివరణ అడగడం కూడా సహజమే. ప్రాంతీయ పార్టీల్లో నేరుగా సస్పెన్షన్లు వేస్తారేమో కానీ ఏపీ బీజేపీలో వివరణ తీసుకుంటారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట్రయూలో రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు రాదంటూ ఓ తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యల పైన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు షోకాజ్‌ నోటీసు జారీ చేసారు. దీని పైన విష్ణుకుమార్‌రాజు వివరణ ఇచ్చారు. టీజీ వెంకటేష్ కు అసలు నోటీసులు కూడా జారీ చేయలేదు. ఆయన కుమారుడు టీజీ భరత్ టీడీపీలో ఉన్నారు. భరత్ అనుచరుడైన ఓ వ్యక్తి తాను వేసిన ప్రకటనలో అత్యుత్సాహంతో టీజీ వెంకటేష్ ఫోటో పెట్టారు. పొరపాటు తెలుసుకని తర్వాతి రోజు సదరు వ్యక్తి పత్రికలో ప్రకటన రూపంలో వివరణ కూడా ఇచ్చారు. పార్టీలో చర్చేజరగని అంశంపై మాజీ యంపీ టిజీ వెంకటేష్ వివరణ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం రాష్ట్ర నేతలను ఆశ్చర్యం కలిగించింది.

బీజేపీ వ్యహారారాలు చురుగ్గా ఉన్నాయంటే… పార్టీ అధ్యక్షుడు వేగంగా పని చేస్తున్నారన్నదానికి..క్రమశిక్షణ పర్ ఫెక్ట్ గా ఉందని చెప్పడానికి సాక్ష్యం. అంతే కానీ..దాన్ని కూడా నెగెటివ్ కోణంలో చూడటం .. వ్యతిరేక కథనాలు రాయడం ఆ పార్టీ మీడియా కుట్రే అనుకోవచ్చు.

బీజేపీ అడుగులపై రెండు పార్టీల్లోనూ భయం !’

బీజేపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అవలంభిస్తుందన్నదానిపై రెండు ప్రాంతీయ పార్టీలు వణికిపోతున్నాయి. జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందనేది ఇప్పటి వరకూ ఉన్న నిజం. కానీ హైకమాండ్ ఆదేశాల మేరకు నడుచుకోవడం ఏపీ బీజేపీ నేతల విధి. వారి వ్యూహం ఏ ప్రకారం ఉంటుందో అలా నడుచుకోవడమే రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తూంటారు. వారి నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు అభిప్రాయం చెప్పగలరు కానీ ప్రభావితం చేయలేరు. ఇతర పార్టీల నేతలు అసలు చేయలేరు. కానీ ఏపీ బీజేపీ నేతలపై ఇతర పార్టీల ముద్ర వేయడం ద్వారా అలాంటివి సాధించవచ్చని ఆ పార్టీలు భ్రమపడుతున్నాయి. అందుకే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలను ఏపీ బీజేపీ నేతలు చేస్తున్నారు.

చార్జిషీట్ల ఉద్యమం నుంచి దృష్టి మరల్చే కుట్రే !

ఏపీ బీజేపీ చార్జిషీట్ల ఉద్యమానికి విశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్చందంగా ప్రభుత్వంపై తమ ఫిర్యాదులను ఇస్తున్నారు. నాలుగు వేల శక్తి కేంద్రాల నుంచి బీజేపీకి అందుతున్న అభియోగపత్రాలే ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకానికి సాక్ష్యమని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ సారి బీజేపీ .. ప్రాంతీయ పార్టీల కుట్రలకు తలొగ్గదని.. సత్తా చూపిస్తుందని అంటున్నారు. చార్జిషీట్ల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చే వ్యూహాన్ని తమకు ఉన్న మీడియా, సోషల్ మీడియా బలంతో ఆ పార్టీలు అవలంభిస్తున్నాయి. అయితే ఇలాంటివి ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసని.. ఏపీ బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.