ఎండల నుంచి ఉపశమనం కోసం ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగేస్తున్నారా..అయితే మీ గుండె జాగ్రత్త!

ఎండలో బయటకు వెళ్లి రాగానే ప్రిజ్ లోంచి చల్లటి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేసి హమ్మయ్య ప్రాణం లేచిచ్చొంది అనుకుంటారు. చెమట ద్వారా శరీరంలో నీళ్లు మొత్తం బయటకుపోయినట్టు అనిపించడంతో ఎక్కువగా లిక్విడ్స్ పై ఆధారపడతారు. ప్రిజ్ లోంచి కేవలం నీళ్లే కాదు కొబ్బరి నీళ్లు, జ్యూసులు, లస్సీ ఇవన్నీ కూడా చల్లచల్లగా తీసి తాగుతుంటారు. ఎప్పుడోఓసారి పర్వాలేదు కానీ తరచూ తాగితే మాత్రం గుండెకు సంబంధించిన ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన ఆరోగ్య నిపుణులు…చల్లదనం కావాలి ఆరోగ్యం బావుండాలంటే ఏం చేయాలో కూడా కొన్ని సూచనలిచ్చారు.

ప్రిడ్జ్ లో చల్లటి పానీయాలు తాగితే..
-ఆయుర్వేదం ప్రకారం అతి చల్లని నీరు ఆరోగ్యానికి హానికరం
-చల్లని నీరు లేదా పానీయాలు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది
-ఆయుర్వేద సూత్రాల ప్రకారం జీర్ణక్రియ అనేది నోటి నుంచి ప్రారంభమై పేగుల్లో ముగిసే ఒక వేడి ప్రక్రియ. కొన్ని పరిశోధనలు -చల్లని నీరు తాగడం వల్ల ఈ ప్రక్రియకు భంగం కలుగుతుంది. తద్వారా అజీర్తి సమస్యలు కూడా వస్తాయి
-ప్రిడ్జ్ నుంచి తీసిన చల్లని నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, గొంతు వాపు వంటి సమస్యలు రావచ్చు
-చల్లని నీరు తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పు వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రజలు ఎక్కువ చల్లగా ఉన్న నీటిని తాగడం వల్ల వాగస్ అని పిలిచే నాడి ప్రభావితం అవుతుంది.
-తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటి ప్రభావం నేరుగా ఈ నరాల మీద ఉంటుంది. దీని కారణంగానే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. అంటే గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది.
-చల్లని నీటిని తీసుకోవడం వల్ల వెన్నుముకలోని నరాలు చల్లబడతాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి..దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సైనస్ సమస్యలతో బాధపడేవారు ప్రిడ్జ్ లో నీటిని తాగకూడదు
-బరువు తగ్గాలనుకునే వారు అస్సలు చల్లటి పానీయాలు తాగకూడదు. చల్లని నీటి వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరగడం కష్టంగా మారుతుంది. ఈ ఫ్రిడ్జ్ వాటర్ వల్ల కొవ్వు గట్టిపడిపోతుంది.

కుండలో నీళ్లు ఉత్తమం
చల్లటి నీళ్లు మంచివి కాదంటున్నారు మరి వేడిగా తాగాలా అంటారా..వేడిగా కాదు కానీ గది ఉష్ణోగ్రతకి సరిపడా చల్లదనం ఉన్న నీటిని తాగొచ్చు. లేదంటే కుండలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మట్టిలో ఎన్నో మినరల్స్, సాల్ట్స్‌ ఉంటాయి. అలాగే అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జీ దాగుంటుంది. ఇలాంటి మట్టితో తయారుచేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతాం. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు. మట్టిలో ఉండే ఖనిజలవణాలు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.ఎసిడిటీ సమస్యను తగ్గించడమే కాదు జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. సందేహాలుంటే వైద్యనిపుణులను సంప్రదించదలరు.దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.