కర్ణాటకలో తెలుగు కమ్యూనిటీ మొత్తం బీజేపీ వైపు మొగ్గు చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నేతలు తెలుగు కమ్యూనిటీతో విస్తృతంగా సమావేశం అయ్యారు.ఇతర పార్టీల నేతల సమావేశాలకు తెలుగు ప్రజలు పెద్దగా హాజరు కాలేదు కానీ బీజేపీ నేతల సమావేశాలకు మాత్రం పెద్ద ఎత్తున హాజరయ్యారు.తెలంగాణ బీజేపీ ముఖ్య నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . ఏపీ నుంచి ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగు కమ్యూనిటీలతో సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీకే మద్దతివ్వాలని కోరుతున్నారు. వారి ప్రచారానికి సానుకూల స్పందన లభించంది.
తెలుగు ఓటర్లను ఆకట్టుకున్న బీజేపీ నేతలు
ఉత్తర కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్, హోసూర్, కోలార్, బీదర్, గంగావతి, రాయచూర్, కొప్పోల్, గుల్బర్గా, వంటి చాలా ప్రాంతాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. అక్కడ చాలా మంది కన్నడ వారు కూడా తెలుగు మాట్లాడగలరు. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచారానికి వెళ్తున్నారు. రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. అందుకే కీలక నేతలంతా అక్కడే మకాం వేశారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రచారం ప్రారంభమయినప్పటి నుండి అక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటనల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. సోము వీర్రాజు సహా పలువురు నేతలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుకున్నప్పటికీ కోలుకున్న వెంటనే కిషన్ రెడ్డి కూడా ప్రచారంలోకి వచ్చారు. తెలుగు కమ్యూనిటీతో సమావేశాలు నిర్వహించారు.
బీజేపీ తరపున సినీ నటుల ప్రచారం !
బీజేపీ తరపున బ్రహ్మానందం చిక్ బళ్లాపూర్‌లో ప్రచారం చేశారు. చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు మద్దతుగా ప్రచారం చేశారు. సుధాకర్ ఎంతో మంచివాడని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. వ్యక్తిగత సంబంధాలు ఉన్న బీజేపీ నేతల కోసం.. పలువురు ప్రముఖులు కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. కన్నడ స్టార్లకు తెలుగులోనూ గుర్తింపు ఉంది. కిచ్చా సుదీప్, దర్శన్ వంటి వారు కూడా తెలుగు ఓటర్లకు తెలుగులో విజ్ఞప్తి చేశారు. బీజేపీని గెలిపించాలని కోరారు.
తెలుగు వారిని సమన్వయం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి !
క ఎలక్షనీరింగ్‌లో ఓటు వేసేవారిని పోలింగ్ బూత్ వరకూ రప్పించడం కీలకం. తెలుగు ఓటర్లు బీజేపీపై అభిమానం చూపిస్తున్నారు. అయితే వారిని సమన్వయం చేయడానికి కర్ణాటఇప్పటి వరకూ బీజేపీ నేతలకు పెద్ద సమస్యగా ఉండేది. కానీ తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విష్ణువర్దన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి.. సమన్వయకర్తలా వ్యవహరించారు. బీజేపీ నేతలు.. తెలుగు వారికి ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటారని భరోసా కల్పించగలిగారు. ఇది కర్ణాటక బీజేపీ నేతల్ని కూడా అకర్షించి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా, మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. అత్యధిక సర్వేల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోంది.