అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ సినిమాపై పాజిటివ్ వైబ్స్!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి కొదవలేదు. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినప్పటి నుంచీ థియేటర్లలో సినిమా సందడి చేసేవరకూ ప్రతీదీ సెంటిమెంటే. మే 5న ఉగ్రం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘మే’ నెల అల్లరోడికి బాగా కలిసొస్తుందని..ఉగ్రం కూడా సూపర్ హిట్టవుతుందంటున్నారు అభిమానులు.

‘అల్లరి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటించి కామెడీహీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నరేశ్. అల్లరి నరేశ్ అంటే కామెడీ సినిమాలు అనే జోనర్ నుంచి బయటకు వచ్చి తనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మహర్షి, నాంది సినిమాల్లో నరేష్ క్యారెక్టర్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. తాజాగా ‘ఉగ్రం’ సినిమాలో విశ్వరూపం చూపించాడంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూసి సినీ ప్రియులు అవాక్యయ్యారు. అల్లరి నరేశ్ ఉగ్రరూపం చూసి ఈ సినిమా కూడా ‘నాంది’ సినిమాకు మించి విజయం సాధిస్తుందని ఫిక్సయ్యారు. టైమ్ కలిసొస్తే అన్నీ కలిసొస్తాయ్ అన్నట్టు ‘మే’ నెల సెంటిమెంట్ కూడా కలిసొచ్చింది.

‘మే’ సెంటిమెంట్
కొందరికి దసరా, మరికొందరికి సంక్రాంతి..ఇంకొందరి సమ్మర్ సెంటిమెంట్ అయినట్టే.. అల్లరి నరేశ్ కి మే నెల సెంటిమెంట్. ఈ నెలలో విడుదలైన నరేశ్ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
-నరేశ్‌ మొదటి సినిమా ‘అల్లరి’ మే 10వ తేదీ 2002లో విడుదలై ఇంటి పేరుగా మారిపోయింది.
-తండ్రి ఇవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘కితకితలు’ 2006 మే 5న విడుదలై సూపర్ హిట్ అందుకుంది
-ఘన విజయాన్ని అందుకున్న ‘సీమటపాకాయ్’ కూడా 2011 మే 13న విడుదలైంది
-నరేశ్‌ కెరీర్ ను మరో మలుపు తిప్పిన ‘మహర్షి’ కూడా 2019 మే 9 నెలలోనే విడుదలైంది
ఇలా నరేశ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలన్నీ మే నెలలోనే వచ్చాయి. ఈ సెంటిమెంట్ కు తోడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాంది’ సూపర్ హిట్టైంది..ఇప్పుడు అదే కాంబినేషన్లో తెరకెక్కింది ‘ఉగ్రం’. ఇలా అన్నీ కలిసొచ్చే పాయింట్లే కనిపిస్తున్నాయి.

ఫైట్లు డిఫరెంట్
మొన్నటి వరకూ అల్లరోడి సినిమాలో కావాల్సినంత కామెడీ చూశారు..అయితే ఉగ్రంలో మాత్రం ఫైట్స్ డిఫరెంట్ అని చెబుతున్నారు మూవీ టీమ్. ముఖ్యంగా అల్లరి నరేశ్ ప్రతి ఇంటర్యూలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సినిమాలోని ఫైట్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేశారని , ప్రతి ఫైట్ ఎమోషన్స్ తో లింకై ఉంటుందని చెప్పాడు. కథాకథనాలతో పాటు ఫైట్స్ హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా ‘ఉగ్రం’ పై ఎటుచూసినా పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతోంది, ఉగ్రం రివ్యూలు పాజిటివ్ గా వస్తాయా? నరేశ్-విజయ్ కనకమేడల కాంబినేషన్ మరో హిట్టందుకుంటారా?…మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది…