సైజ్ జీరో అని సంబరపడకండి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది

అనారోగ్య సమస్యలన్నింటికీ అధికబరువే కారణం..సన్నగా ఉంటే అనారోగ్య సమస్యలు రావు, రోగాలు రావని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. సన్నం-లావు అనే తేడాలేకుండా కొన్ని రకాల వ్యాధులు దాడిచేస్తాయి. అలాంటి వ్యాధుల్లో ఒకటి ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’. దీన్నే కొవ్వు కాలేయ వ్యాధి అంటారు. వాస్తవానికి ఈ వ్యాధి ఎక్కువగా..ఊబకాయంతో బాధపడేవారికి వస్తుంది. కానీ కొన్ని రకాల కారణాల వల్ల సన్నగా ఉన్న వారికి కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ కారణాలేంటంటే..

ఆల్కాహాల్ తీసుకునేవారికి తప్పదు
మద్యం సేవించే అలవాటు ఉన్నవాళ్లు బక్కగా ఉన్నా కూడా వారికి ఫ్యాటీ లివర్ డిసీస్ బారిన పడే అవకాశం ఉంది. మద్యంలో ఉండే క్యాలరీలు జీరో. అందుకే మద్యం కాలేయంలో చేరుకున్నాక కొవ్వుగా మారిపోతుంది. అలా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. అందుకే మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

కండలు లేకపోవడం
కొందరు సన్నగా ఉంటారు. కండలు ఉండవు. ఎంతో కొంత కండర ద్రవ్యరాశి ఉండడం చాలా ముఖ్యం. ఎండిపోయినట్టు, పీక్కుపోయినట్టు చేతులు, కాళ్లు ఉన్నా, కండరాలు పుష్టిగా లేకపోయినా కొవ్వు పేరుకుపోతుంది.

వారసత్వంగా రావొచ్చు
వారసత్వంగా వచ్చే ఆస్తులతో పాటూ కొన్ని వ్యాధులు కూడా వస్తాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి ఒక వయసు దాటాక బయటపడుతుంది. ఊబకాయం కూడా వారసత్వంగా వస్తుంది కాబట్టి..ఈ రెండూ కలసే వచ్చే ప్రమాదం ఉంది.

జీవక్రియ రుగ్మత
ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటివి రావడానికి కొన్ని రకాల జీవక్రియ సమస్యలు కూడా కారణమే. విల్సన్స్ వ్యాధి పిలిచే జీవక్రియ రుగ్మత వల్ల ఫ్యాక్టరీ లివర్ డిసీస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కాలేయానికి మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. కాలేయం కోసం వెల్లుల్లి, ఓట్స్ తో వండిన ఆహారం, చేపలు, కాఫీ, గ్రీన్ టీ, ద్రాక్ష, ఆలివ్ ఆయిల్, బెర్రీ పండ్లు, గుడ్లు, నట్స్ వంటివి తీసుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎలాంటి సందేహాలున్నా మీరు వైద్యులను సంప్రదించాలి. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం