కాంగ్రెస్ మేనిఫెస్టోనా.. పీఎఫ్ఐ మేనిఫెస్టోనా..

కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ఎన్నికల్లో తమదే గెలుపంటూ సొంత సర్వేలు చేయించుకుని మీడియాలో విస్తృత ప్రచారం ఇస్తోంది. డబ్బులిచ్చిన భారీగా జన సమీకరణ చేసుకుంటూ వాపును బలుపుగా చూపించుకునే ప్రయత్నంలో ఉంది. అంతటిలో ఆగకుండా ఇప్పుడు తన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కానీ హామీ ప్రకటించింది. కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే కర్ణాటక బడ్జెట్ కు అదనంగా ఏటా లక్ష కోట్ల వ్యమవుతోంది.

హిందూ సేవ సంస్థలపై అక్కసు

హిందూ సంస్థలపై కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకతా భావంతోనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాలని చూడడం, విపక్షంలో ఉన్నప్పుడు ఆయా సంస్థలపై ఆరోపణలు సంధించడం ఆ పార్టీకి నిత్యకృత్యమైంది. తాజాగా కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే పని చేసింది. హిందు యువకుల సేవా సంస్థ బజరంగ్ దళ్ ను పీఎఫ్ఐతో పోల్చింది. బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ప్రకటించింది.

ప్రధాని మోదీ గట్టి కౌంటర్

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హనుమంతుడు పుట్టిన గడ్డపై నిలబడటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకున్న ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తానని చెప్పడం దురదృష్టకరమన్నారు. అంజనాద్రి పర్వతంగా హనుమంతుడు జన్మించాడని గుర్తుచేస్తూ రాముడన్నా, ఆంజనేయుడన్నా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మోదీ అన్నారు. కర్ణాటక సంస్కృతీ, సంప్రదాయాలను దెబ్బతీసే కాంగ్రెస్ ప్రయత్నాలను బీజేపీ ఎన్నడూ ఒప్పుకోదన్నారు.

కర్ణాటక సీఎం బొమ్మాయ్ కూడా కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బజరంగ్ దళ్ ను నిషేధించాలని కాంగ్రెస్ భావిస్తే… కాంగ్రెస్ నే కూకటి వేళ్లతో పెకిలించి దేశం బయట పడేస్తారన్నారు. అది కాంగ్రెస్ మేనిఫెస్టో కాదని, పీఎఫ్ఐ మేనిఫెస్టో అని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ అన్నారు. మత ఛాందసవాదులను కాంగ్రెస్ వెనుకేసుకు రావడం మొదటి నుంచి జరిగిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆరోపించారు..

ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైన వెంటనే హస్తం పార్టీ దుర్నితీ దేశం మొత్తానికి అర్థమైపోయింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలన్న ఆ పార్టీ ఉద్దేశం తెలిసొచ్చింది. తమ భుజంపై తుపాకీ పెట్టి ఎవరినో కాల్చాలన్న కాంగ్రెస్ ప్రయత్నం తేటతెల్లమైంది. దానితో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం సహా పలు చోట్ల బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను దహనం చేశారు…

కాంగ్రెస్ తప్పులో కాలేసిందా..

కాంగ్రెస్ కు ఆ ఆలోచన ఎవరిచ్చారో కానీ ఆ పార్టీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవా భావంతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న బజరంగ్ దళను ఆ పార్టీ కదలించి కొట్లాడినట్లయ్యింది. హస్తం పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న బజరంగ్ దళ్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని రాత్రికి రాత్రి డిసైడైంది. డోర్ టు డోర్ క్యాంపైన్ అంటే ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యలను ఎండగట్టాలని డిసైడైంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం అథోగతి పాలైన తీరును వివరించబోతుంది. ప్రచారానికి ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే బీజేపీకే ఓటు వేయాలని చెప్పబోతున్నారు. మరి ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి…