ఇంట్లో చెత్తను ఊడ్చే చీపురును మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే చీపురును కాలితో తొక్కకూడదు, దానిపై నుంచి దాటకూడదు అని చెబుతారు పెద్దలు. అయితే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురును పెట్టాల్సిన ప్రదేశంపై కూడా కొన్ని సూచనలు చేశారు పండితులు.
మహాలక్ష్మీ స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురుని ఏ తలుపు మూలనో పెట్టేస్తారు. అయితే మూలన పెట్టడం వరకూ ఓకే కానీ ఏ మూలన పెడుతున్నాం అన్నది ముఖ్యం. వాస్తు ప్రకారం నాలుగు దిక్కులతో పాటూ నాలుగు మూలల గురించి కూడా చెబుతారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం దిక్కులైతే… ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి మూలలు. ఇందులో ఈశాన్య మూల దేవుడిని పెట్టే ప్రదేశం, ఆగ్నేయ మూలన వంటగది ఉంటుంది. అయితే చీపురును ఏమూలనపెట్టాలో గమనిస్తే..
1.ఇల్లు ఊడ్చేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతివైపు చెత్తను పోగుచేయాలి కానీ ఈశాన్యం వైపు ఎప్పుడూ చెత్తను పోగుచేయరాదు
2.ఈశాన్యం దిశగా చెత్తను పోగుచేస్తే ఈ ఇంట్లో సంపద నిలకడగా ఉండదంటారు వాస్తు నిపుణులు
3.ఈశాన్యం దేవుడు ఉండే ప్రదేశం కాబట్టి… ఈశాన్యం దర్వాజా వైపు తప్ప ఏ దర్వాజ వెనుకవైపు అయినా గోడకు మేకు కొట్టి చీపురు పెట్టొచ్చు.
4.చీపురును తల్లకిందులుగా పెడతారు…నేరుగా పెడితే పాడైపోతుందని ఇలా చేస్తారు కానీ …ఏ పొజిషన్లో చీపురు పట్టుకుని ఊడ్చుతామో అదే పొజిషన్లో పెట్టాలి
- చీపురు రివర్స్ లో పెడితే శనికి ఆహ్వానం పలుకుతున్నట్టే అని చెబుతారు.
- ఇంటికి వచ్చే అతిథులకు కనిపించేలా చీపురు పెడితే అరిష్టం
- చీపురు, చాట ఒకే దగ్గర ఉంచడం -ఇంటిలోపల, బయట ఒకే చీపురు వాడకం అస్సలు మంచిదికాదు
- పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది
- సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి
- బెడ్ రూమ్ లో మంచం కింద వస్తువులు సర్దేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు, చెత్త, ముఖ్యంగా చీపురు ఉండకూడదట. మంచం కింద మాత్రమే కాదు బెడ్ రూమ్ లో చీపురు కనిపించకూడదు
చీరుపు ఎప్పుడు కొనొచ్చు, ఎప్పుడు కొనకూడదు
1.మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపదమాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు
2.గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణము తర్వాత రోజు చీపురు కొనకూడదు
- పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, హస్తా, శ్రవణం, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదు
4.పాడైపోయిన చీపురు సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడవేయాలి
5.ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికకాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి
6.బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంటిలో అప్పటివరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్లీ వాడకూడదు
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం.వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం